Breaking News

2022 నూతన సంవత్సర వేడుకలకు మంత్రి పేర్ని నాని దూరం

-అభిమానులు దయచేసి రావద్దని మనవి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది 2022 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం  ఒక ప్రకటన లో పేర్కొన్నారు. మన రాష్ట్రంలో సైతం ఒమిక్రాన్ కేసులు శరవేగంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్యంకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నూతన సంవత్సరం వేడుకలు తాను జరుపుకోవడం లేదని మంత్రి తెలిపారు. కొత్త సంవత్సర వేడుకలు మీ కుటుంబసభ్యుల మధ్యలో మీరు ఆనందంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. కొత్త ఏడాది వేడుకల తరువాత ఒకవేళ ఒమిక్రాన్ లక్షణాలు వస్తే, కుటుంబం మొత్తం బాధ పడాలి కాబట్టి ముందు జాగ్రత్తలు తప్పనిసరి అని ఆయన అన్నారు. కోవిడ్ నివారణకు రెండు వాక్సిన్లు తీసుకున్నవారు ఒకవేళ హోటెళ్లు, రెస్టారెంట్లలో బహిరంగంగా వేడుకలు చేసుకునే వారు, ఎంతో కొంత భౌతిక దూరం పాటించాలని అలాగే మాస్కు ధరించి గతంలో మాదిరిగానే శానిటైజర్లు వినియోగించాలని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ విస్తరిస్తున్న దృష్ట్యా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు, నియోజకవర్గం ప్రజలు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ఎవరు తనను కలవడానికి రావద్దని తాను అందుబాటులో ఉండటం లేదని ఆయన విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *