Breaking News

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా…

-హోంశాఖ మంత్రిసుచరిత

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీల పునరుద్ధరణకు కృషి చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. శుక్రవారం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా నూతన సంవత్పర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా నాయకులకు రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నసమస్యలను మంత్రి సుచరిత దృష్టికి తీసుకొనివెళ్ళగా కరోనాతో అసువులుబాసిన జర్నలిస్టులకు ప్రభుత్వ ప్రకటించిన 5లక్షల ఎక్షగ్రేషియా, కార్పొరేట్ విద్యాసంస్థలలో వందశాతం పీజురాయుతీ, దాడులపై కమీటీలుఏర్పాటుతో పాటు జర్నలిస్టుల సమస్యలను వివరించగా, హోంశాఖ మంత్రి సుచరిత మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళి సత్వరపరిష్కారానికి తనపంతు కృషిచేస్తాన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, గుంటూరుజిల్లా ఏపియూడబ్ల్యూజె ఆధ్యక్షులు యస్.యన్.మీరా, గుంటూరు జిల్లా ఎలాక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్అసోసియేషన్ఆధ్యక్షులు కారుమంచి సునీల్ సందీప్, రాష్ట్రనాయకులు మార్కండేయులు, ఓ.జయమెహన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *