గత ప్రభుత్వ హయాంలో వక్ఫ్ బోర్డు లో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలి… : సయ్యద్ నూరుద్దీన్


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రామవరప్పాడు లో ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన వక్ఫ్ బోర్డు లోని కొంతమంది అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తులను  లాంగ్ లీజుల పేరుతో వక్ఫ్ భూములను భారీ ఎత్తున అమ్మేసి తమ జేబులు నింపుకున్నారని దుయ్యబట్టారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే భారీ స్థాయిలో అవినీతి అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వక్ఫ్ ఆస్తుల గజదొంగలు వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే నూతన వక్ఫ్ బోర్డులో మళ్లీ తిరిగి పదవులు పొందేందుకు ప్రయత్నం లాబీయింగ్ చేస్తున్నారని ఆవేదన చెందారు. గత టీడీపీ ప్రభుత్వం లో ఏర్పాటైన రాష్ట్ర వక్ఫ్ బోర్డు లో జరిగిన పెద్ద పెద్ద అక్రమాలు అవినీతి  బట్ట బయలైనప్పటికీ వాటిపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వానికి ఆయా శాఖల అధికారులు దారుణంగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. కాబట్టి అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్న అధికారులను పసిగట్టి వారిని పక్కన బెట్టి రిపోర్ట్స్ తెప్పించుకుని రాష్ట్రం వక్ఫ్ బోర్డు లో నామినేటెడ్ పోస్టుల లో గాని ఇతర ఎలెక్టెడ్ కేటగిరిలో గాని నియమించాలని కోరారు . ఈ కార్యక్రమంలో ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ సభ్యులు షేక్ మస్తాన్. ఎండి అలీ. సయ్యద్ ఆసిఫ్. మహబూబ్ బాషా. హుమాయూన్  భాషా. మరియు మత పెద్దలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *