

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తాడేపల్లి మండలం కొలనుకొండలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హరే కృష్ణ గోకుల క్షేత్రానికి రాష్ట్ర మఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం భూమి పూజ చేశారు. భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ముందుగా భూవరహా స్వామి యజ్ఞం పూర్ణహుతి చేసి, భూమి పూజ చేసి శాస్తోక్తంగా గోకుల క్షేత్ర నిర్మాణంకు భూమి పూజ చేశారు. బాలకృష్ణుడు, రాధ కృష్ణులకు పూజలు చేసి ముఖ్యమంత్రి హారతి తీసుకున్నారు. హరే కృష్ణ గోకుల క్షేత్రం నమూనా చిత్రాల ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం హరేకృష్ణ గోకుల క్షేత్ర భూమి పూజ శిలఫలకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. దేవదాయశాఖకు చెందని క్యాలెండరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. బెంగుళూరు బృందావన చంద్రోదయ మందిర్ చైర్మన్ మధు పండిట్ దాస్ ముఖ్యమంత్రికి భగవద్గీత, బాగవతం గ్రంధాలను అందించారు. హరే కృష్ణ మూమెంట్ రూ. 70 కోట్ల అంచనాలతో నిర్మిస్తున్న హరే కృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వరస్వామి, రాధకృష్ణుల ఆలయాలతో పాటు కళా క్షేత్రాలు, యువత కోసం శిక్షణా కేంద్రం, యోగ ధ్యాన కేంద్రాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర గృషనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, జిల్లా కలెక్టరు వివేక్ యాదవ్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్, శాసనమండలి సభ్యులు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, సంయుక్త కలెక్టరు ఎఎస్ దినేష్ కుమార్, అనుపమ అంజలి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) శుభం బన్సాల్, హరే కృష్ణ మూమెంట్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రెసిండెంట్ సత్య గౌర చంద్ర దాసు, భక్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News