

-“నవ భారత నిర్మాణానికి యువత సహకారం మరియు పరిష్కారాలు అవసరం ” బి జె ప్రసన్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నవ భారత నిర్మాణానికి యువత యొక్క స్వరం మరియు విధానపరమైన నిర్ణయాలకు సహకారం అవసరం అని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు బి జె ప్రసన్న అన్నారు భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మరియు యానాం, గుంటూరు వారి ఆధ్వర్యంలో గురువారం జాతీయ యువ పార్లమెంట్ ఫెస్టివల్ కార్యక్రమం లో భాగంగా రాష్ట్ర స్థాయి లో ప్రధమ, ద్వితీయ స్థానాల మరియు తృతీయ స్థానాల ఎంపిక కొరకు ఈ రోజు అనగా 24-02 -2022 న వర్చ్యువల్ పద్దతిలో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ ఔర్ సబ్ కా విశ్వాస్, సంకల్ప్ సే సిద్ధి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, బీజ్ సే బజార్ తక్ అండ్ లాబ్ టు లాండ్ హర్ ఖేత్ కో పానీ అండ్ పేర డ్రాప్ మోర్ క్రాప్. మేక్ ఇన్ ఇండియా, ఖేలో ఇండియా-ఫిట్ ఇండియా , స్టార్ట్ అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా అంశాలపై వకృత్వ పోటీలు పోటీదారుల ఉచ్చారణ, ఆయా అంశంపై వారి ఆలోచన యొక్క స్పష్టత, కంటెంట్ నాలెడ్జ్, ప్రవర్తన పై స్టేట్ లెవెల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ నిర్వహిచడం జరిగింది.
ఈ కార్యక్రమానికి నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు బి జె ప్రసన్న ముఖ్య అతిధి గా పాల్గొని పోటిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ యువత ప్రజా సమస్యలతో నిమగ్నమవ్వడానికి, సామాన్యుల దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి, వారి అభిప్రాయాలను రూపొందించడానికి మరియు దానిని స్పష్టంగా వ్యక్తీకరించడానికి మరియు ప్రోత్సహించడానికి మరియు విజన్ అఫ్ ఇండియా పై వారి అభిప్రాయాలను విధాన రూప కర్తలు మరియు చేసేవారికి అందుబాటులో ఉంచటం లక్ష్యం అని చెప్పారు. అలాగే యువకులు దైర్యంగా స్థిరంగా తమ తమ అభిప్రాయాలను వెల్లడించాలని వారి వాణి దేశ వ్యాప్తంగా వినిపించిన నాడు వారి అభిప్రాయాలూ చట్ట సభలలోను పరిగణన లోకి తీసుకొనే అవకాశం ఉంటుందని అందువల్ల ప్రతిఒక్కరు తమ అభిప్రాయాలను నిష్పక్షపాతం గా వినిపించాలని, రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన మరియు పాల్గొన్న పోటీదారులందరికి అభినందలు తెలిపారు. అలాగే జాతీయ స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన వారికి 2 లక్షలు ద్వితీయ స్థానం సాధించిన వారికీ 1.5 లక్షలు, అలాగే తృతీయ స్థానం సాధించిన వారికి 1 లక్ష అలాగే 2 కన్సోలేషన్ బహుమతులు 50 ,౦౦౦ రూపాయలు మరియు ప్రశంస పత్రాలు అందజేస్తారు అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమములో నెహ్రూ యువ కేంద్ర గుంటూరు జిల్లా యువ అధికారి కు.కిరణ్మయి దేవిరెడ్డి అధ్యక్షత వహించగా , విజయనగరం యూఎన్డిపి జిల్లా యువ అధికారి విక్రమాదిత్య నిర్వహణలో, జ్యూరీ సభ్యులు గా గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజి ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాము ఆఫీసర్ డా. సి హెచ్ ప్రవీణ్, డా. బిళ్ళా కిరణ్ కుమార్ , డి బి ఎచ్ పి సభ అసోసియేట్ ప్రొఫెసర్ పి యై బి ఎల్ ప్రసూనా, అసోసియేట్ డా. ఎం శ్రీహరి మరియు గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజి హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుభాని వ్యవహరించగా రాష్ట్రం లో అన్ని జిల్లా ల మరియు యానాం నుంచి మొత్తం 28 మంది పోటీలో పాల్గొనగా ప్రథమ స్థానంలో లో కృష్ణా జిల్లాకు చెందిన జాలాది సికిందర్ ద్వితీయ స్థానంలో విజయనగరం కు చెందిన లాల మౌనిక మహా లక్ష్మీ బాయి తృతీయ స్థానంలో తూర్పుగోదావరి జిల్లా కోసం చెందిన కే లక్ష్మి లాలిత్యా నిలిచి ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ నుంచి జాతీయ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ కు అర్హత పొందారు . పాల్గొన్నవారందరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేయడం జరుగుతుంది. ప్రోగ్రాము అసిస్టెంట్ బుర్ర సీతారాం వందన సమర్పణ చేసారు .
Prajavartha Online Telugu News