విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని తూర్పు నియోజకవర్గ ఇన్-ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. శనివారం నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో 14, 17 డివిజన్ లకు చెందిన సాదినేని సతీష్,పచ్చళ్ళ భారతి,సిరిపురపు సుబ్రహ్మణ్యం, మన్నెం లక్ష్మమ్మమ, కటారి స్వాతి లకు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 1,50,000 రూపాయలు చెక్కులును అందజేశారు. అవినాష్ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని లక్ష్యం తో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సీఎం జగన్మోన్ రెడ్డి నిధులు మంజూరు చేస్తున్నారు అని తెలిపారు. అందరు ఆరోగ్యముగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో ప్రభుత్వ పల సాగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ నాయకులు కడియాల బుచ్చిబాబు, 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య, 17వ డివిజన్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబెర్ తంగిరాల రామిరెడ్డి, వైఎస్సార్సీపి నాయకులు రాజ్ కమల్, గల్లా రవి, శెటికం దుర్గాప్రసాద్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News