మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీలలోని రీ ఓపెన్డ్ ఆర్జీలపై జిల్లా కలెక్టర్ జె నివాస్ సమీక్ష నిర్వహించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, తాసిల్దారులు, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిష్కరించగలిగే అర్జీలను అతి తక్కువ సమయంలోనే పరిష్కరించి అర్జీదారునకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. తమకు సరైన పరిష్కారం లభించలేదనే ఫిర్యాదు మరల రాకూడదన్నారు. సోమవారం స్పందనలో వచ్చిన అర్జీలను వారంలోపే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీలు పెండింగ్లో లేకుండా ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. పెండింగ్ అర్జీలు అత్యధికంగా పమిడిముక్కల మండలంలో 9, తిరువూరు 6, ఏ కొండూరు 4 అర్జీలు ఉన్నాయన్నారు. ఒక్కొక్కటిగా ఉన్న మిగతా మండలాల అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి అన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవిన్యూ డిపార్ట్మెంట్ ల నుండి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు డా. కే మాధవీలత (రెవెన్యూ), ఎల్. శివశంకర్ (అభివృద్ధి), కే. మోహన్ కుమార్ (ఆసరా), జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నగర పర్యటనలో నగర పాలక సంస్థ …