-డివిజినల్ మరియు మండల కేంద్రాలలో కూడా స్పందన కార్యక్రమం నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 28వ తేదీ సోమవారం మచిలీపట్టణం లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10.30 ని. ల నుండి స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులందరూ 28వ తేదీ సోమవారం ఉదయం 10. 30 ని.లకు మచిలీపట్టణం లోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్పందన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలోని డివిజినల్ మరియు మండల కేంద్రాలలో కూడా స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు.