కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు సమీపంలోని గామాన్ బ్రిడ్జ్ సమీపంలో శనివారం ఉదయం టోల్ ప్లాజా వద్ద ప్రమాదానికి గురైన రసాయనాల తో కూడిన వాహనాల నుంచి రసాయనిక పదార్థాలు నిపుణుల బృందం ఆధ్వర్యంలో సురక్షితంగా బయట తీసి ఆ వాహనాలు తరలించడం జరిగిందని తహశీల్దార్ బి. నాగరాజు నాయక్ తెలిపారు. ఆదివారం సాయంత్రం గామాన్ బ్రిడ్జి ప్రాంతంలో టోల్ గేట్ వద్ద రెవెన్యూ, పోలీసు, ఫైర్ అధికారులతో కలిసి తరలింపు ప్రక్రియ ను పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు వివరాలు తెలుపుతూ, ప్రమాద భరిత మైన గ్యాస్ లతో నిండిన రెండు వాహనాల్లో ఒక వాహనాన్ని నిన్ననే ఖాళీ చేసి డ్రమ్ముల్లో నింపి సిల్ వేసి తరలించడం జరిగిందన్నారు. మెసర్స్ వర్జిన్ సాల్వెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు బృందం మిథనాల్ డై క్లోరైడ్ ఉన్న వాహనం నుంచి రసాయనాన్ని సురక్షితంగా ఈరోజు బయటకు తీసివేశారని పేర్కొన్నారు. వాటిని డ్రమ్ముల్లో నింపి తరలించామన్నారు. కొవ్వూరు తహసీల్దార్ బి.నాగరాజు నాయక్ తో పాటు సీఐ వై. వి. రమణ, ఎస్సై కె. రామకృష్ణ, అగ్నిమాపక అధికారి సన్యాసి నాయుడు, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితి ని పర్యవేక్షించారు.
Tags kovvuru
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …