Breaking News

విద్యతో పాటు నైపుణ్యాభివృద్ది కోర్సులు.. భవిష్యత్తు కి భరోసా…

 
విజయ గాధ

-రాష్ట్రంలో సర్కార్ బడుల్లో సంస్కరణలతో వడివడిగా అడుగులు

చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్టప్రభుత్వ ఒక స్పూర్తితో కూడిన ఆలోచన కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా, అంతకుమించి సర్కార్ పాఠశాలను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. భోధనాంశాలతో పాటుగా స్వయం ఉపాధి సాధించేందుకు వీలుగా వృత్తి విద్యా కోర్సుల పై ప్రభుత్వం శిక్షణ అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కి, ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తోం ది. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో 16 వృత్తి విద్యా కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలోనే ప్రతి వ్యర్ధానికి ఒక అర్థం ఉంటుందని చెప్పే విధానం అటువంటి వస్తువుల ను వినియోగించి చక్కటి కళారూపాలకు విద్యార్థులు ప్రాణం పోస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సుమారు 16 కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కుట్లు అల్లికలు, ఎంబ్రాయిడరీ, డిజైనింగ్, డెకరేషన్, తదితర కోర్సులలో శిక్షణ అందిస్తున్నారు. చాగల్లు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కుట్లు అల్లికలు, వివి ధ రకాల కాగితపు పువ్వులతో బొకేలు తయారీ వంటివి నేర్పించడంపై దృష్టి సారిస్తున్నారు.

పాఠశాలల్లో నిర్వహించే వేడుకలకు పూల అలంకరణ, ముఖ్య అతిథులకు బొకే లను విద్యార్థుల సొంతంగా తయారు చేసి అందరి ప్రశంసలు పొందుతున్నారు. పాఠాలతోపాటు, నైపుణ్య విద్యకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు . ప్రతి తరగతి విద్యార్థులకు వారంలో ఐదు రోజులు శిక్షణ ఉండేలా ప్రణాళిక రూపొందించారు. విద్యార్థులు తయారు చేసిన ఉత్పత్తులను కేవలం ప్రదర్శనలకే పరిమితం చేయకుండా ప్రదర్సనల్లో వాటిని విక్రయించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో విద్యార్థులో వారి ప్రతిభకి గుర్తింపుతో పాటుగా కొంత ఆదాయం సమకూరుతోంది.

చాగల్లు మండలం లో 4 ప్రభు త్వ పాఠశాల లో సుమారు 400 మంది విద్యార్థులు వృత్తి విద్యా కోర్సులల్లో నైపుణ్యం సాధిస్తున్నారు. చాగల్లు మండలం లో మార్కొండపాడు, బ్రాహ్మణగూడెం, ఊనగట్ల, చిక్కాల గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వృత్తివిద్యా కోర్సులను విద్యార్థులకు నేర్పుతున్నారు.

చాగల్లు మండలనికి చెందిన పి. ఉమాదేవి, విద్యార్ది వారి అభి ప్రాయం తెలుపుతూ వృత్తి విద్యా కోర్సులు విద్యార్ది దశ నుండే నేర్చుకోవడం వల్ల చిన్న తనం లోనే మా కుటుంబానికి ఆసరా గా నిలబడడానికి నాకు ఆత్మ స్థర్యం పెరిగిందన్నారు.

బ్రాహ్మణగూడెం జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు, ఎన్. ఉషాబాల, తదితర ఉపాధ్యాయులు వారి అభిప్రాయం తెలుపుతూ విద్యార్థులలోని సృజనాత్మకతను గుర్తించి వృత్తి విద్యా కోర్సు లను ప్రవేశ పెట్టి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో వారికి పాఠ్య పుస్తకాల్లోని విద్యని భోదించడంతో పాటుగా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ను కల్పించడం జరుగుతొందన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *