అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎంతో మందికి మేలు చేస్తూ ఎన్నో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కరించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రతినిధి రాష్ట్ర అధ్యక్షులు నాగిపోగు కోటేశ్వరరావు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పిఎంపి, ఆర్‌ఎంపిలకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు గతంలో గ్రామీణ వైద్యులకు తర్ఫీదు కూడా ఇచ్చారని తెలియజేశారు. ట్రైనింగ్ అయిన పిఎంపి, ఆర్‌ఎంపిలకు గ్రామీణ వైద్యులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఆర్‌ఎంపి శిక్షణ తరగతులు కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని నిరాశ వ్యక్తం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఈ విషయమై పలు సంఘాల నాయకులు విన్నవించారని, మెమోరాండం కూడా అందజేశామని చెప్పారు. దీనిపై స్పందించిన జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ విషయమై జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి జీవో నెంబర్ 429ను వెంటనే పునరుద్ధరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామీణ వైద్యులకి, ఆర్‌ఎంపి, పిఎంపి సంక్షేమ సంఘం నాయకులకు, ప్రతినిధులకు, సభ్యులతోపాటు ప్రతి ఒక్కరికి నాగిపోగు కోటేశ్వరరావు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
Tags amaravathi
Check Also
ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత
-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …