విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం 114వ జయంతి సంధర్భంగా తూర్పు నియోజకవర్గం లో 7వ డివిజన్ శిఖామణి సెంటర్ నందు బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి వైస్సార్సీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అవమానాల అనుభవాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి జగగ్జీవన్ రాం అని, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేసిన కృషి వలుడు అని, సమాజంలో ఆసమానతులను రూపుమాపేందుకు అలుపెరుగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త అని, స్వాతంత్ర్య సమరయోధుడుగా దేశం కోసం ఆహర్నిశలు పనిచేసి, స్వాతంత్ర్య భారతవనిలో ఉప ప్రధానిగా తన సేవలను అందించిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రావు అని అటువంటి ఆయన ఆశయ సాధనకు మనందరం కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాధురి, అంబేద్కర్, వైస్సార్సీపీ నాయకులు రాజ్ కమల్, చిత్రం లోకేష్, విఠల్ సంపత్, సుభాషిణి, ప్రేమలత మరియు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …