Breaking News

సన్మార్గ జీవన విధానానికి రంజాన్ మాసం బాటలు వేస్తుంది…

-ఖాజా బాబా ఆశ్రమంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పండగ సన్మార్గ జీవన విధానానికి బాటలు వేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. మహోన్నత రంజాన్ మాసంలో అతి పవిత్రమైన తొలి శుక్రవారం అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలోని ఆస్థాన ఏ గరీబ్ నవాజ్ ఖాజా బాబా ఆశ్రమంలో ఉపవాస దీక్షలు చేస్తున్న సోదరులకు ఇఫ్తార్ విందు జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపక ధర్మకర్త పఠాన్ బాబ్జీ ఉమర్ ఖాన్ ఇస్లాం సాంప్రదాయం ప్రకారం వీరిని సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. వరాల వసంతంగా అభివర్ణించే రంజాన్ మాసం ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ అష్టైశ్యర్యాలతో వర్థిల్లాలని ప్రార్థించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4 శాతం రిజర్వేషన్లు కల్పించి అన్ని విధాలా ఆదుకున్నారని గుర్తుచేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ఉర్దూ భాషను రాష్ట్రంలో రెండో అధికారిక భాషగా ప్రకటించి.. ముస్లిం మైనార్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అల్లా దివ్య ఆశీస్సులతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు, సంక్షేమం అందించాలని కాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రివర్యులు నిండు నూరేళ్లు చల్లగా ఉండేలా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని ముస్లిం పెద్దలను మల్లాది విష్ణు కోరారు. అనంతరం ఖాజా బాబా ఆశ్రమం వార్షికోత్సవ వేడుకలలో, అజ్మీర్ షరీఫ్ ఉరుసు మహోత్సవాలలో ప్రాచీన యుద్ధ కళలను ప్రదర్శించిన బృందానికి, వాలంటీర్లుగా సేవలందించిన పలువురికి ఎమ్మెల్యే చేతులమీదుగా సత్కారం చేశారు. పారిశుధ్య కార్మికులకు చీరలు పంచిపెట్టారు. తదననంతరం ఓ మాతృమూర్తి జీవనోపాధి కోసం తోపుడు బండిని ఖాజా బాబా ఆశ్రమం తరపున ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపక ధర్మకర్త పఠాన్ బాబ్జీ ఉమర్ ఖాన్, నాయకులు అలంపూర్ విజయ్, దుర్గారావు, వేపాల కిరణ్, నాని, అఫ్రోజ్, sd. బాబు, ముస్లిం మత పెద్దలు, సోదరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *