ప్రతి సోమవారం స్పందన ఫిర్యాదులు స్వీకారం

-హార్లిక్స్ ఫ్యాక్టరీ సమీపంలోని న్యాక్ భవన్ సముదాయంలో జిల్లా కలెక్టరేట్
-ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం
-సోమవారం రోజున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉచిత బస్సులు
-ఏప్రిల్ 11 న సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఉచిత బస్సు
-కలెక్టర్ డా. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన ఫిర్యాదులను నూతనంగా బొమ్మూరు గ్రామంలో న్యాక్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ కార్యాలయం లో ఇకపై ప్రతి సోమవారం స్పందన ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత పేర్కొన్నారు.

శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో సంబంధించిన శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా.కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ వారికి అందచేసే స్పందన ఫిర్యాదులను ఏప్రిల్ 11వ నుంచి జిల్లా కలెక్టరేట్ లో స్వీకరించడం జరుగుతుందన్నారు. రాజమహేంద్రవరం రూరల్ గ్రామం ధవళేశ్వరం లో ఉన్న న్యాక్ (ఎన్. ఏ. సి) భవనంలో కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. స్పందన కి ప్రజలు రావడానికి వీలుగా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఉదయం 9 నుంచి మ. 2 వరకు తాత్కాలికంగా ఉచిత బస్సు సర్వీసు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే విధంగా స్థానిక సబ్ కలెక్టర్ నుంచి స్పందన లో ఫిర్యాదులు ఇచ్చే ప్రజల కోసం కూడా ఉచిత బస్సు ను ఏప్రిల్ 11 వ తేదీన నడుపుతున్నట్లు మాధవీలత తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్పందన ఫిర్యాదులను గ్రామ/వార్డు సచివాలయాల్లో , రెవెన్యూ, మండల స్థాయిల్లో కూడా స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

మోరంపూడి నుంచి వేమగిరి వైపు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో ఉన్న హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న న్యాక్ భవన సముదాయంలో కలెక్టరేట్ ఏర్పాటు చెయ్యడం జరిగిందని కలెక్టర్ డా.మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం కి పలు రూట్లలో నడిపే ఆర్టీసీ బస్సులు సోమవారం రోజున ఉదయం కొన్ని బస్సులు కలెక్టరేట్ మీదుగా నడిపేలా రూట్ మ్యాప్ రూపొందించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్డీవో ఎస్.మల్లిబాబు, ఆర్టీసీ, రవాణా, రెవెన్యూ శాఖ లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *