మంత్రిగా సంతృప్తితో శాఖ బాధ్యతలు నిర్వర్తించాను… : వెల్లంపల్లి

-టీడీపీ,జనసేన తొత్తులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు
-14ఏళ్లలో ఆర్య వైస్యులకు చంద్రబాబు చేసింది సూణ్యం
-ఆర్య వైస్యులకు సీఎం జగన్ పెద్ద పీట వేశారూ
-సామాజిక విప్లవానికి సీఎం జగన్ అడుగులు వేశారు.
-ఎన్టీఆర్ జిల్లాకు మంత్రి పదవి రాకపోయినా అభివృద్ధి సంక్షేమం ఆగదు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక బ్రాహ్మణ వీధిలో గల మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో మంగళవారం నాడు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెలంపల్లి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచిదేవాదాయ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారని సంతృప్తితో శాఖ బాధ్యతలు నిర్వర్తించానన్నారు. దేవాదాయ శాఖ భూములు రక్షణ, ఆలయాల భద్రతకు పెద్ద పీట వేశామన్నారు. దుర్గ గుడికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకున్నన్నారు.దుర్గ గుడి ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం పుష్కరాల పేరుతో కూల్చేసిన గుళ్లను మూడేళ్ళలో నిర్మించాం అని తెలియచేసారు. అంతర్వేది రధం పునర్నిర్మాణం చేసామని, రామతీర్థం ఆలయం అభివృద్ధి చెస్తున్నామన్నారు.దేవాదాయశాఖలో ఏ నిర్ణయం తీసుకున్న సీఎం అడ్డు చెప్పలేదన్నారు. అర్చకులకు వంశపారంపర్యంగా కొనసాగింపు,ఇళ్ల నిర్మాణం లాంటి వాటిని ఆమోదించేలా అడుగులు వేసామన్నారు. టీడీపీ, జనసేన తొత్తులు వైస్యులకు వైసీపీ అన్యాయం చేసిందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 14ఏళ్లలో ఆర్య వైస్యులకు చంద్రబాబు చేసింది సూణ్యమన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 126 సత్రాలను తిరిగి వైస్యులకు దక్కేలా సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆర్య వైస్యుల మనోభావాలు దెబ్బతినెల ఉన్న చింతామణి నాటకాన్ని రద్దు చేసిన ముఖ్యమంత్రి ఆర్య వైస్యుల పక్షపాతి అన్నారు. ఆర్య వైస్యులకు సీఎం జగన్ పెద్ద పీట వేశారన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పొట్టి శ్రీరాముల వర్ధంతిని ఘనంగా నిర్వహించలేని దౌర్భాగ్యంలో అనాడు చంద్రబాబు ఉన్నాడన్నారు. జగన్ సీఎం అవ్వగానే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారని తెలియచేశారుపొట్టి శ్రీరాములు జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. సామాజిక విప్లవానికి సీఎం జగన్ అడుగులు వేశారన్నారు ఆర్య వైస్యుల పట్ల టీడీపీ, జనసేన ముసలి కన్నీరు కారుస్తున్నాయన్నారు. ఆర్య వైస్యులు చంద్రబాబు మాయలో పడొద్దని విజ్ఞప్తి చేశారు.దిక్కుమాలిన రాజకీయాలు చేసే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ మాటలు నమ్మొద్దని పిలుపునిచ్చారు నాకు అడక్కుండానే మంత్రి పదవి ఇచ్చారు,క్యాడర్ ఎవ్వరు ఆందోళన చెందదాల్సిన అవసరం లేదన్నారు. ఎస్సి, ఎస్టీ,బిసిలకు సీఎం జగన్ పెద్ద పీట వేశారన్నారు. సీఎం జగన్ మంత్రి పదవులు ఇచ్చినప్పుడే రెండున్నరేళ్లు ఉంటుందని చెప్పారన్నారు. మంత్రి పదవులకు రాజీనామాలు చేసామన్న ఆందోళన ఎవరికి లేదన్నారు 26జిల్లాలు అయిన 25 మంది మంత్రులు మాత్రమే ఉంటారన్నారు. సామాజిక సమీకరణాల నేపద్యంలో మంత్రి పదవులు కేటాయింపులు జరిగాయన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు ఇంచార్జ్ మంత్రి రాబోతున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాకు మంత్రి పదవి రాకపోయినా అభివృద్ధి సంక్షేమం ఆగదన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *