Breaking News

గృహ నిర్మాణం వేగవంతం చేయండి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న గృహ నిర్మాణ లబ్దిదారులు సకాలంలో తమగృహాలను నిర్మించుకోవాలని, ప్రభుత్వం లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించేందుకు సంసిద్ధంగా ఉందని అధికారులు గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి. రంజిత్ బాషా ఆదేశించారు.
స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం స్పందన సమావేశపు మందిరంలో శనివారం వివిధ శాఖల అధికారులతో వైఎస్‌ ఆర్‌ జగనన్న సం పూర్ణ గృహ నిర్మాణ పథకంపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. గృహ నిర్మాణాల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను గృహ నిర్మాణ శాఖ అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ పథకం అమలు విషయంలో జాప్యం ఎందుకు జరుగుతుందో సంబంధిత శాఖల అధికారులు శ్రద్దగా పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. అద్దె ఇళ్లలో ఉండే వారు ఇంటి నిర్మాణానికి ముందుకు వస్తారని అటువంటి వారికి అవసరమైన సదుపాయాలను తక్షణం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇంకా మొదలు కాని ఇళ్ళ నిర్మాణాలు 15 రోజుల్లో బేస్ మెంట్ స్థాయికి తీసుకురావాలని, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని, అదే విధంగా లే ఔట్లలో అవస రమైన అంతర్గత రహదారులు, తాగునీరు, విద్యుత్‌ సదుపాయాలను కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పలు మండలాల్లో ఇప్పటికే కొద్దిమేర నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, మరి కొన్ని ప్రాంతాల్లో ఇంకా నిర్మాణాల ఊసే లేదన్నారు. అధికారులు లబ్ధిదారులతో మాట్లాడి ప్రతి ఒక్కరూ ఇళ్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి రిజిష్ట్రేషన్‌ ఛార్జీలను చెల్లించనక్కర్లే కుండానే, తమ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిష్ట్రేషన్‌ చేయించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశమన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు వన్‌టైంసెటిల్‌మెంట్‌ పథకం నూరు శాతం విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. వివిధ గృహనిర్మాణ పథకాల ద్వారా రుణాలు తీసుకుని, ఇళ్లు నిర్మించుకున్నవారికి, వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ ద్వారా ఆయా ఇళ్లు, స్థలాలను తమ పేరుమీద రిజిష్టర్‌ చేసుకునే గొప్ప అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తుందన్నారు. తద్వారా లబ్ధిదారుడుకి దానిపై సంపూర్ణ హక్కులు కలుగుతాయని తెలిపారు. వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ పథకం కింద కనీస రుసుము చెల్లించి ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని, వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం జరుగుతుందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు జగనన్న గృహ నిర్మాణాలు వేగవంతమయ్యేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. అధికారుల అలసత్వం వహిస్తే సహించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. జగనన్న లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అధికారులు కృషి చేయాలని కోరారు. ఇళ్ళ నిర్మాణాలు త్వరగా నిర్మించుకునేలా ప్రభుత్వం ఉచిత ఇసుక, సబ్సిడిపై సిమెంట్, ఐరన్ అందిచడంతో పాటు, అదనపు రుణాలను కూడా మంజూరు చేయడం జరుగుచున్నదని, లబ్దిదారులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని త్వరగా ఇళ్లు నిర్మించుకోపోవాలన్నారు. ప్రతి గ్రామం లోనూ రోజుకు కనీసం 10 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు కావలసిన మౌలిక వసతులు ఏర్పాటుచేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం నిర్మా ణాలకు కావలసిన మెటీరియల్ ఇసుక, సిమెంట్, ఐరన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో గృహ నిర్మాణ లబ్దిదారులకు అవగాహన కల్పించి పనులు వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం కొరకు వాట్సాప్ గ్రూప్ నెలకొల్పి జిల్లాలోని వివిధ మండలాలలో జరుగుతున్న జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ పథకం పనుల పురోగతి పోస్టుల ద్వారా తెలియచేయాలని తానూ ఆ గ్రూప్ అప్ డేట్స్ ను తాను నిత్యం పరిశీలిస్తుంటానని కలెక్టర్ తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారం మినహా గుడ్ మాణింగ్ లు , గుడ్ నైట్ లు వంటి పోస్ట్ లు పెట్టరాదని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల , జిల్లా హోసింగ్ పి డి. కె.రామచంద్రన్ , డ్వామా పి డి , మచిలీపట్నం ఎంపిడీఓ జి. సూర్య నారాయణ, ఏపి టీట్కో పి ఓ చిన్నోడు, మచిలీపట్నం, గుడివాడ మునిసిపల్ కమీషనర్లు, పంచాయితీరాజ్ శాఖ, గృహ నిర్మాణ శాఖ, విద్యుత్ శాఖల అధికారులు , ఆర్‌డబ్య్లూఎస్ ఏఈ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *