తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
తెనాలి మారుమూల పినపాడు కు చెందిన మల్లెబోయిన వేంకట చంద్రశేఖర్ కుమార్తె “M.వేంకటవాహిని” ఇటీవల మేజిస్ట్రేటు గా ఎంపికయ్యారు. ఈమెతండ్రి పంపు మెకానిక్ గా (Plunber) పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా తెనాలి కోర్ఠుహాలులో మంళవారం బార్ అసోషియేషన్ సభ్యులు జడ్జి “వాహిని”ను ఘనంగా సన్మానించారు . అథ్యక్షుడు దాసరి శ్రీథర్ తమ బార్ అసోషియేషన్లోని అతిసాథారణ వ్యక్తికి జడ్జి రావటం తమకెంతో ఆనందంగా ఉందని ఆమె మరిన్ని ఉన్నత శిఖరలను చేరుతారని జూనియర్లు ఆమెను స్పూర్తిగా తీసుకోవాలన్నారు.తెనాలి నియోజకవర్గ BC సంక్షేమ సంఘ అద్యక్షుడుజొన్నాదుల వేంకటేశ్వరరావు మాట్లాడుతూ నిబథ్థతతో కష్టపడి పదవిసాథించారని అలాగే న్యాయసేవను అన్ని వర్గాలవారికి అందిస్తారన్నారు. తనవద్ద జూనియర్ గా పనిచెసి కృషి చట్టుదలతో Software ఉద్యోగాన్ని వదలి జడ్జిఅయ్యరని ఆమె Case study చక్కగా చేయటం గమనించానని గ్రంథి జయరాం అన్నారు. ఇంకా ఈకార్యక్రమంలో జగదీశ్వరాంబ విజయ,చింతసురేష్ గుమ్మడి రవిరాజ్ వేణుగోపాల్ సింక సురేష్ మద్డి మల్లిఖార్జునరావు YCP నాయకుడు శాయి ఆమెను ఘనంగా సన్మానించి ఆమె ఈ స్థితికి రావటానికి కుటుంబ సభ్యుల సహకారంమరువరానిదని అభినందనాలు తెలిపారు.
Tags tenali
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …