పరిశుభ్ర నగరంగా రాజమహేంద్రవరం… : దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వీపింగ్ యంత్రాల పనితీరు ఆకస్మిక తనిఖీ చేసినట్లు నగర పాలక సంస్థ కమీషనర్ కె దినేష్ కుమార్ తెలిపారు. సోమవారం అర్ధరాత్రి నగరంలోని కూడళ్ళ లో స్వీపింగ్ యంత్రాల పనితీరుని ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానిక ఆర్ టి సి కాంప్లెక్స్ ప్రాంతం లో స్వీపింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. నగరపౌరులకు ధూళి ,దుమ్ము వల్ల ఇబ్బంది రాకుండా..ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటల తర్వాత వీటిని ప్రధాన కూడళ్లు, రద్దీ తగ్గిన ప్రాంతాల్లో తిప్పి రహదారులను శుభ్రం చేయిస్తున్నామన్నారు. నిర్దేశించిన సిబ్బంది క్షేత్ర స్థాయి లో పనితీరు విషయం లో అలసత్వం ప్రదర్శిస్తే క్షమించేది లేదన్నారు. నగర పరిశుభ్రత విషయం లో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు కమీషనర్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *