విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 72 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొల్లపూడి నాగేశ్వరరావు రాష్ట్ర బీసీ నాయకులు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ లు కేక్ కట్ చేసి స్వీట్లు కార్యకర్తలకు పంచి పెట్టారు. గొల్లపూడి నాగేశ్వరరావు, లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ మా నాయకుడు చంద్రబాబు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు. అమరావతి రాజధాని సృష్టికర్త, అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు ని, నిరంతరం ప్రజాసేవలో ప్రజల తరఫున పోరాడుతూ పార్టీ నాయకులను, కార్యకర్తలను ప్రజలతో ఉండేవిధంగా పార్టీని ముందుకు నడుపుతున్న ప్రజా సేవకుడు చంద్రబాబు ని, 2014 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం, అమరావతి, పట్టిసీమ, గ్రామాల్లో సిమెంటు రోడ్లు, సంక్షేమ పథకాలు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆంధ్ర రాష్ట్రం వైపు ఇతర దేశాలు చూసి గర్వంగా చెప్పుకునే విధంగా చేశారని అన్నారు. 2019 నుండి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా, చీకటి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలకు తప్పనిసరిగా అవసరం ఉందన్నారు. ప్రజల ఆశీస్సులతో 2024 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పరిసపోగు రాజేష్, కోడూరు ఆంజనేయ వాసు, పామర్తి కిషోర్ బాబు,బొల్లా వెంకటేశ్వరరావు గౌడ్, శొంఠి శివరాం ప్రసాద్ గౌడ్, బోయిన సుబ్రమణ్యం,ఉప్పిడి రాము,వాకా వెంకటేశ్వరరావు గౌడ్, ఈడ్పుగంటి అజయ్,కొనసాని నాగమణి, కర్రీ ఉమా మహేశ్వరి, నాగమణి, భాగ్యలక్ష్మి, బేబీ, కుమారి, శ్రీ లక్ష్మి, వరలక్ష్మి, లక్ష్మి, విజయ దుర్గా,దివ్య, నరసమ్మ, పద్మ, భార్గవి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …