ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు నాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయానికి తరలి వచ్చిన కార్యకర్తలు, నేతలు అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం చంద్రబాబు నివాసంవద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చంద్రబాబు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి నేతలతో కలిసి వెళ్లారు. దుర్గగుడి వద్ద ఆలయ ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు.అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాడడానికి తనకు శక్తినివ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. రాజీ లేని పోరాటంతో తెలుగువారికి పూర్వ వైభవం తీసుకువస్తానని చెప్పారు. అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు క్యాడర్‌ ఘన స్వాగతం పలికారు. పార్టీ నేత ఎంఎస్‌ రాజు క్రేన్‌ ద్వారా భారీ పూలమాల వేసి అధినేతకు స్వాగతం పలికారు. అనంతరం మూడు మతాలకు చెందిన మత పెద్దలు చంద్రబాబుకు ఆశ్వీర్వచనం అందించారు. మరో నేత కొమ్మారెడ్డి కిరణ్‌ ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను నేతల సమక్షంలో కట్‌ చేశారు. తెలంగాణ నుంచి సైకిల్‌ యాత్ర ద్వారా వచ్చిన తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జయరాంతో పాటు ఇతర నాయకులు చంద్రబాబును కలిసి పార్టీ కార్యాలయం శుభాకాంక్షలు తెలిపారు. ఎవరిని కాదనకుండా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగారు. అందరి నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. అధినేత జన్మదినం సందర్భంగా గా పార్టీ నేతలు కొందరికి నిత్యావసర వస్తువులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తమ అధినేత జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *