విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నేరుగా అవ్వ తాత ల ఇంటికి పించన్లు వాలంటరీ వ్యవస్థ అందజేస్తుందని మాజీ మంత్రి, వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ టి ఆర్ జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వేలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక 34వ డివిజన్ కేదారేశ్వరపేట వి ఎల్ దత్తు మున్సిపల్ పాఠశాల ప్రాంగణంలో 34,35,54,55, మరియు 56 డివిజన్ల వార్డు సచివలయలలో సేవలు అందిస్తున్న వార్డ్ వాలంటీర్లందరికీ సేవా మిత్రా, సేవ రత్న, సేవ వజ్ర పురస్కారాల మహోత్సవం జరిగింది ఈ మహోత్సవంకు మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి పురస్కర గ్రహితలకు శాలువ కప్పి ప్రశంస పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు రుహుల్ల , నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు బండి పుణ్యశిల, బలసాని మనెమ్మా, అర్షద్, శిరంశెట్టిి పూర్ణచందర్రావు, యలకల చలపతిరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు నగర పాలక సంస్థ అధికారులు సచివాలయ సిబ్బంది మరియు పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …