-వైఎస్ఆర్ సిపి స్టేట్ జాయింట్ సెక్రెటరీ గుండుపల్లి సతీష్ కుమార్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైఎస్ఆర్ సిపి స్టేట్ జాయింట్ సెక్రెటరీ గుండుపల్లి సతీష్ కుమార్ కోరారు. నగరంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి స్టేట్ జాయింట్ సెక్రెటరీ గుండుపల్లి సతీష్ కుమార్ మాట్లాడుతూ గతంలో కరోనా విజృంభించిన సమయంలో మీ అందరి సహకారంతో మనమంతా కలసికట్టుగా తీసుకున్న జాగ్రత్తలు మూలంగా కరోనా కట్టడి సాధ్యమైందన్నారు. దురదృష్టవశాత్తు కరోనా మూలంగా కొందరు ఆప్తులు, శ్రేయోభిలాషులను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మరోమారు పెరుగుతున్న నేపథ్యంలో గతంలో తీసుకున్న జాగ్రత్తలను మరోమారు పాటిద్దాం అన్నారు. మన ప్రాణాలు మన ఆరోగ్యం మన రక్షణ కోసం మాస్క్ లు తప్పనిసరిగా దరిద్దాం అని అన్నారు. శానిటైజర్ లు వినియోగం చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటిద్దాం అని అన్నారు.జన సమూహాలకు దూరంగా ఉందామన్నారు. పరిసరాల పరిశుభ్రతలో మనమంతా భాగస్వామ్యం అవుదామన్నారు. కరోనా నివారణకు మరొక్కసారి మనమందరం నడుం బిగిద్దాం అన్నారు. దీనికి తనవంతుగా ప్రజల అందరి సహకారం కావాలన్నారు.