తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఏపీ కీలక కేంద్రం అవుతోంది. పలు గ్లోబల్ కంపెనీలు రాష్ట్రంలో కంపెనీలను ఏర్పాటు చేస్తున్నాయి. తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీలో) గురువారం ఒక్కరోజే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రతిష్టాత్మక కంపెనీలకు చెందిన 3 యూనిట్లను ప్రారంభించారు. అడిడాస్ షూస్ తయారు చేస్తున్న అపాచీ కంపెనీ యూనిట్ సహా మరో రెండు ఎలక్ట్రానిక్స్ యూనిట్లకు కూడా సీఎం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రారంభించిన, భూమి పూజ చేసుకున్న పరిశ్రమల పెట్టుబడుల విలువ దాదాపు రూ.4వేల కోట్లుకాగా, సుమారు 20వేల మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో హిల్ టాప్ ఎస్ ఈ జెడ్ డెవలప్ మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (అపాచీ) జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కె.నారాయణస్వామి, విద్యుత్తు, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, అపాచీ ప్రతినిధులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇనగలూరులో అపాచీ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమన్నారు. మొదటి దశలో రూ.350 కోట్లు, వచ్చే ఐదేళ్లలో మరో రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అపాచీ పరిశ్రమలో అడిడాస్ షూలు, లెదర్ జాకెట్స్, బెల్ట్‌లు వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు లభిస్తాయన్నారు. 2023 సెప్టెంబర్ కల్లా పరిశ్రమ అందుబాటులోకి వస్తుందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో 80 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్ తెలిపారు.
ఏపీ ప్రభుత్వం తోడ్పాటు మరువలేనిది: టోనీ
పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి అపాచీ కంపెనీ డైరెక్టర్ టోనీ కృతజ్ఞతలు తెలియజేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అందించిన తోడ్పాటు మరువలేనిదన్నారు. పారిశ్రామికరంగాన్ని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన యూనిట్లు ఇవే…
1. వకుళమాత దేవాలయం ప్రారంభించిన తర్వాత సీఎం శ్రీకాళహస్తి సమీపంలోని ఇనగలూరు వద్ద హిల్‌టాప్ ఎస్‌ఈజెడ్ డెవలప్‌మెంట్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ (అపాచీ) పరిశ్రమకు భూమి పూజచేశారు. రెండు దశల్లో రూ.800 కోట్లను ఈకంపెనీ ఖర్చుచేయనుంది. 10వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇందులో 80శాతం మహిళలకే. విఖ్యాత బ్రాండ్ అడిడాస్ షూలు, లెదర్‌జాకెట్స్, బెల్టులు తదితరవాటిని అపాచీ తయారుచేస్తోంది. సెప్టెంబరు 2023 నాటికి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం అవుతుంది.
2. తర్వాత సీఎం టీసీఎల్ సబ్సిడరీ కంపెనీ పానెల్ ఆప్టో డిస్‌ప్లే టెక్నాలజీ ప్రయివేట్ లిమిటెడ్ (పీఓటీపీఎల్)యూనిట్‌ను ప్రారంభించారు. ఈ యూనిట్‌కోసం రూ.1230 కోట్ల పెట్టుబడి పెట్టింది. 3200 మందికి ఉపాధిని కల్పిస్తోంది. టీవీప్యానెళ్లు, మొబైల్ డిస్‌ప్లే ప్యానెళ్లను ఈ కంపెనీ తయారుచేస్తోంది.
3. దీంతోపాటు ఫాక్స్‌లింక్ తయారీ యూనిట్‌నుకూడా ఇవాళ సీఎం ప్రారంభించారు. హెచ్‌పీ ప్రింటర్లకు అవసరమైన ప్రింటెడ్ సర్క్యూట్‌బోర్డులను ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఐఫోన్లకు యూఎస్‌బీ ఛార్జర్లనుకూడా తయారు చేస్తున్నారు. ఈ యూనిట్‌ద్వారా ఈ కంపెనీ రూ.1050 కోట్ల పెట్టుబడి పెట్టింది. 2వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది.
4. సెల్‌ఫోన్లలో కెమెరా మాడ్యూల్స్‌ను తయారుచేసే
సన్నీ అప్పోటెక్ యూనిట్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ.280 కోట్ల పెట్టుబడి పెట్టారు. 1200 మందికి ఉద్యోగాలను కల్పించారు.
5. టెలివిజన్ సెట్లను తయారుచేసే డిక్సన్ టెక్నాలజీస్ యూనిట్‌కు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. రూ. 108 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. 850 మందికి ఉద్యోగాలు కూడా రానున్నాయి.
6. ఫాక్స్ లింక్‌ఇండియా కొత్తగా నిర్మించనున్న మరో యూనిట్‌కు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. రూ.300 కోట్లను ఇన్వెస్ట్ చేస్తున్నారు. 1200 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
తిరుపతి ఈఎంసీ వేదికపై ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహనా ఒప్పందాలు…
1. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీతో స్మార్ట్‌డీవీ టెక్నాలజీస్ ఒప్పందం కుదుర్చుకుంది. హై ఎండ్ వీఎఎల్‌ఎస్‌ఐ డిజైన్ టెక్నాలజీలో దాదాపు 3వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. రూ.100 కోట్లు పెట్టుబడి పెడుతోంది.
ఇదే కంపెనీ హై ఎండ్ వీఎఎల్‌ఎస్‌ఐ డిజైన్ టెక్నాలజీ 10వేలమంది యువతకు శిక్షణ కూడా ఇవ్వనుంది.
2. టీసీఎల్ కార్పొరేషన్‌కు చెందిన పీఓటీపీఎల్ ఎలక్ట్రానిక్స్ కూడా ఎంఓయూ కుదుర్చుకుంది. తమ వ్యాపార విస్తరణలో భాగంగా పంపిణీవ్యవస్థను, అనుబంధ పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ఈ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
3. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్స్ రంగం అవసరాలను తీర్చేందుకు, రాష్ట్రాన్ని తయారీ కేంద్రంగా మార్చేందుకు జెట్‌వర్క్ టెన్నాలజీస్ ఒక ఎంఓయూను కుదుర్చుకున్నారు. బ్రహ్మాండంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న యూనికార్న్ కంపెనీల్లో జెట్‌వెర్క్ టెక్నాలజీస్ ఒకటి.
4. ఐటీ సేవల ఎగుమతికోసం టియర్ 2,3 నగరాల్లో రాష్ట్రవ్యాప్తంగా కార్యాలయాలు తెరిచేందుకు ఏపీఈఐటీఏతో టెక్‌బుల్స్ ఎంఓయూను కుదుర్చుకుంది.
Prajavartha Online Telugu News