Breaking News

అంగన్‌వాడీల్లో జులై1 నుండి పాలు, గ్రుడ్డుతో సహా మధ్యాహ్న భోజనం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలలో గర్బిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు వండిన అహారాన్ని వేడిగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ సిరి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55607 అంగన్‌వాడీ కేంద్రాలలో జూలై ఒకటి నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో 2020 మార్చి నెలలో వండిన ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని నిలిపి వేయగా, ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని తిరిగి పున: ప్రారంభిస్తున్నామని వివరించారు. తల్లులకు ఇంటి వద్దనే పోషకాహార సామాగ్రిని అందించే కార్యక్రమం జూన్ 30 వరకు కొనసాగుతుందని డాక్టర్ సిరి పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో 3-6 సంవత్సరాల వయస్సు గల ప్రీ-స్కూల్ పిల్లలకు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు గుడ్డు, పాలతో సహా వేడి వేడి భోజనాన్ని అందిస్తామన్నారు. రాష్ట్రంలో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించే ధ్యేయంతో ముఖ్యమంత్రి మానసపుత్రికగా ప్రభుత్వం గర్భిణీ, పాలిచ్చే తల్లులు, 6 నుండి 72 నెలల పిల్లల కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను అమలు చేస్తోందని డాక్టర్ సిరి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *