Breaking News

నాణ్యమైన విద్య, వైద్యం వైసీపీ ప్రభుత్వం తోనే సాధ్యం: దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘ గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్, 57వ సచివాలయం పరిధిలోని కిరసనాయిలు రోడ్డు ప్రాంతంలో తూర్పు నియోజవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఇంటిఇంటికి వెళ్లి లబ్ధి దారులను కలుసుకున్నారు. అవినాష్ మాట్లాడుతూ గడప గడప కార్యక్రమంలో ప్రజలు అందరూ కూడా శ్వచందంగా వారికి వచ్చిన లబ్ధి గురించి వేరే వివరిస్తూ ముఖ్యమంత్రి శ్రీ జగ్మోహన్రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అని అవినాష్ అన్నారు.
ఇంటింటికి ప్రచారంలో ప్రజలు అందరూ కూడా గత ప్రభుత్వంలో వైద్యానికి ఎంతో ఖర్చు పెట్టే వారిని కానీ జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒకరికి ఉచితంగా నాణ్యమైన వైద్యం అందుతుందని వారి సంతోషాన్ని తెలియజేశారు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఉచిత నాణ్యమైన విద్యతో వారి పిల్లల్ని చదివిస్తున్నామని గత ప్రభుత్వంలో విద్యకి వైద్యానికి ఎంతో ఖర్చు పెట్టే వారిని ఖర్చు పెట్టినా కూడా నాణ్యమైన విద్య, వైద్యం దొరికేది కాదని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తరువాత వారికి విద్య, వైద్యం ఉచితంగా అందుతుందని ప్రజలు వారి హర్షాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, విద్యా దీవెన ద్వారా వారి పిల్లల్ని బాగా చదివిస్తున్నామని వారిపైన ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు అని అవినాష్ అన్నారు. గతంలో విద్యా వైద్యానికి ఎన్నడు లేనట్టు విధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక పేదలకు అవసరమైన విద్య వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య వైద్యాన్ని వైసిపి ప్రభుత్వం అందిస్తుందని అవినాష్ తెలిపారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అన్ని కూడా డిజిటలైజేషన్ చేసి ప్రతి ఒక్కరిలోనూ చదువుకోవాలనే ఆసక్తిని కలగ చేస్తున్నారని ప్రతి ఒక్కరూ కూడా ఉన్న అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని అవినాష్ కోరుకున్నారు. ప్రభుత్వం పేదలకు అవసరమే అన్ని పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటుంటే టిడిపి మాత్రం ఈ పథకాల పైన దుష్ప్రచారం చేస్తూ పేదలు నోటికాడు కూడుని దూరం చేసే విధంగా వారు కార్యక్రమాలు చేయడం సిగ్గుచేటు అని అవినాష్ అన్నారు. గడపగడపకు వెళుతుంటే ప్రజలంతా కూడా మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని కోరుకుంటూ వారి మద్దతును వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు. పర్యటనలలో భాగంగా స్థానికంగా వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నమని అవినాష్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గాన్ని పక్క ప్రణాళిక తో అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, రాష్ట్ర బటరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గీతాంజలి, డివిజన్ ఇంచార్జి మాజి కార్పొరేటర్ రామాయణపు శ్రీనివాస్(అర్.స్), వైసీపీ నాయుకులు ఉకోటి రమేష్,కోలా ఉమా, అబ్దుల్ హనాన్, శ్రీను, పిడుగు విజయ్, పల్లి రమేష్, పల్లి ప్రకాష్, గుండు సతీష్, చాణిక్య బాబురావు, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, మాగంటి నవీన్, ధనికుల కాళీ, శట్టికం దుర్గా ప్రసాద్, కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *