Breaking News

నగర పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్గించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో పారిశుద్యం మెరుగుదలకు ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని, నగర పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్గించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ అన్నారు. బుధవారం కమిషనర్ ప్రజారోగ్య విభాగ అధికారులు, డిప్యూటీ కమిషనర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశం తమ చాంబర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో సచివలయాల వారీగా స్థానిక ప్రజా ప్రతినిధులను, ప్రజలను భాగస్వాములు చేయాలని, రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్ధాలు వేసే వారికీ తొలుత అవగాహన కల్గించాలన్నారు. పారిశుధ్యం సరిగా లేకుంటే ప్రజారోగ్యం కూడా ప్రమాదంలో పడుతుందని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై అధిక శ్రద్ధ చూపాలన్నారు. అలాగే ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, నిర్లక్ష్యంగా ఉండే వారి పై చర్యలు తప్పవని హెచ్చరించారు. యాంటి మలేరియా ఆపరేషన్స్ జరిగినప్పుడు సచివాలయం పరిధిలో ప్రతి ఇంటి సెప్టిక్ ట్యాంక్ పైప్ కు నైలాన్ నెట్ లు కట్టాలని, నీరు నిలిచే ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, గంబుషియా చేపలు విడవడం చేయాలన్నారు. మధ్యాహ్న సమయంలో గ్యాంగ్ వర్క్ ద్వారా సమస్యాత్మక ప్రాంతాల్లో సమగ్ర పారిశుధ్య పనులు, డ్రైన్ల శుభ్రం చేయాలన్నారు. చెత్త తరలింపుకు డివిజన్ల వారీగా వాహనాలను కూడా క్రమ పద్దతిలో వెహికిల్ షెడ్ నుండి పంపాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, సి.ఎం.ఓ.హెచ్. డాక్టర్ విజయలక్ష్మీ. బయాలజిస్ట్ మధుసూదన్ రావు, యస్.యస్.లు రాంబాబు, ఆనందకుమార్, ఏ.ఈ. దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *