న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన విజయవంతంగా సాగింది. సోమవారం ఉదయం నుంచి ఆయన పలు సమయాల్లో ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి రాజ్‌కుమార్‌సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాని నివాసంలో సమావేశమైన సీఎం. పోలవరం, రీసోర్స్ గ్యాప్ కింద నిధులు, జాతీయ ఆహార భద్రతాచట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధత, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై పీఎంకు వినతిపత్రం అందించి, వాటిపై చర్చించిన సీఎం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరిన సీఎం. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ పనులకోసం తన సొంతంగా రూ.2900 కోట్లు ఖర్చుచేసిందని, వీటిని వెంటనే రియంబర్స్ చేయాలని కోరిన సీఎం. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరిన సీఎం. టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరిన సీఎం. ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వైజ్‌గా రియంబర్స్ విధానానికి స్వస్తి చెప్పాలని, దీనివల్ల పనుల్లో విపరీత జాప్యం ఏర్పడుతోందని వెల్లడించిన సీఎం. అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో వ్యవహరించినట్టుగానే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్నే పరిగణలోకి తీసుకుని ఆమేరకు చేస్తున్న పనులకు వెంటనే రియంబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరిన సీఎం. చేసిన పనులకు 15 రోజుల్లోగా రియంబర్స్ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరిన సీఎం. డీబీటీ పద్ధతి ద్వారా భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కింద నిర్వాసితులకు పరిహారాన్ని అందించాలని కోరిన సీఎం. ప్రాజెక్టు నిర్మాణ పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా అడహాక్‌గా రూ.10వేల కోట్లు ఇవ్వాలని పీఎంను కోరిన సీఎం. రీసోర్స్‌గ్యాప్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 32,625.25 కోట్లు మంజూరు చేయాలని ప్రధానిని కోరిన సీఎం. 2014–15 కాలానికి సంబంధించిన బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం బకాయిల రూపంలో, పెన్షన్లు తదితర రూపంలో రాష్ట్రానికి రావాల్సిన ఈనిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టంకింద అర్హుల ఎంపికలో హేతుబద్ధీకరణ లేకపోవడంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, గతంలోనే ఈ అంశాన్ని దృష్టికి తీసుకొచ్చానంటూ ప్రధానికి వివరించిన సీఎం. రాష్ట్రంలో 2.68 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థద్వారా రేషన్ అందుతోందని తెలిపిన సీఎం. వీరిలో 61శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కాగా, 41 శాతం మంది పట్టణ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారన్న సీఎం. చట్టం నిర్దేశించిన ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 75శాతం మందికి, అర్బన్ ప్రాంతంలో 50శాతం మందికి పీడీఎస్ కింద ప్రయోజనాలు అందాల్సింది ఉందని తెలిపిన సీఎం. ఏపీతో పోల్చుకుంటే ఆర్థికంగా మెరుగైన స్థాయిలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో రాష్ట్రంకంటే కనీసంగా 10శాతం మంది లబ్ధిదారులు అధికంగా ఉన్నారని వివరించిన సీఎం. దీనివల్ల అర్హులైన వారికి రాష్ట్రంలో వర్తింపు కావడంలేదని, కేంద్రం ఇస్తున్న దానికంటే అదనంగా దాదాపు 56లక్షల మందికి పీడీఎస్‌ను రాష్ట్రమే వర్తింపు చేస్తోందని తెలిపిన సీఎం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర భారమని, ఇప్పటికే దీనిపై నీతిఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై తదుపరి కీలక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిందని తెలిపిన సీఎం. ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్న కేటాయింపులను పరిశీలించాలంటూ చెప్పిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం. కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్రం ఇస్తున్న దానికంటే, కేంద్రం కవర్ చేయని, అదనంగా 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం వర్తింపు చేసిందని, దీనివల్ల సుమారు రూ.5,527.63 కోట్ల అదనపు భారాన్ని రాష్ట్రం యోయాల్సి వచ్చిందని పీఎంకు వివరించిన సీఎం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ భారం మరింతగా పెరిగే అవకాశం ఉంది. జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారుల గుర్తింపు విషయాన్ని వెంటనే పునఃపరిశీలన చేయాలని, నెలవారీగా రాష్ట్రానికి కేటాయిస్తున్న బియ్యం కోటాలో 3 లక్షల టన్నులు వినియోగంకాకుండా ఉంటున్నాయని, ఇందులో కేవలం 77వేల టన్నులు కేటాయిస్తే సరిపోతుందని, కేంద్రంపై కూడా ఎలాంటి అదనపు భారం ఉండదని ప్రధానమంత్రికి సీఎం జగన్ వివరించారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని ప్రస్తావించారు. రూ.6,756 కోట్లు బకాయిలు ఉన్నాయని, 8ఏళ్లుగా ఈ సమస్య అపరిష్కృతంగానే ఉందని తెలిపిన సీఎం. ఈ డబ్బు ఇప్పిస్తే పూర్తిగా కష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ కంపెనీలు ఒడ్డున పడతాయని, ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లించడానికి మార్గం సుగమమం అవుతుందని తెలిపిన సీఎం. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం పేర్కొన్నారు. విభజనలో హేతుబద్ధత లేదని, దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని తెలిపిన సీఎం. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు చేయాలన్న సీఎం. ప్రత్యేక తరగతి హోదా సహా హామీలను అమలు చేయలని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి. పారిశ్రామిక రంగం వృద్ధి, ఉద్యోగాల కల్పన, కేంద్రంనుంచి గ్రాంట్లు, పన్ను రాయితీలు తదితర ప్రయోజనాలు ప్రత్యేకతరగతి హోదా ద్వారా వస్తాయని, తద్వారా రాష్ట్రంపై భారం తగ్గుతుందని తెలిపిన సీఎం. రాష్ట్రంలో 26 జిల్లాలకు కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, కొత్తగామూడు కాలేజీలకు అనుమతి ఇచ్చారని, వాటి పనులు కూడా జరుగుతున్నాయని తెలిపిన సీఎం. ఇంకా 12 కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉందని, వీటిని మంజూరు చేయాలని పీఎంకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌కోసం ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని కోరిన సీఎం. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు గనుల కేటాయింపు చాలా కీలకమని, స్థిరంగా ఖనిజం రవాణా అన్నది ప్రాజెక్టు ఏర్పాటులో అత్యంత కీలక అంశమని తెలిపిన సీఎం. ఏపీఎండీసీకి బీచ్‌శాండ్ మినరల్ ఏరియాలను కేటాయించాలను కోరారు. 14 ఏరియాల కేటాయింపు అంశం ఇంకా పెండింగులో ఉందని వివరించిన సీఎం. ఈ రంగంలో దాదాపు రూ.20వేల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందని సీఎం జగన్ తెలిపారు.
Prajavartha Online Telugu News