Breaking News

సమన్వయంతో పని చేసి ప్రభుత్వ పధకాలను ప్రజలకు మరింతగా చేరువ చేయవచ్చు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజా వార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శులు, మెప్మా ఆర్.పి.లు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ పధకాలను ప్రజలకు మరింతగా చేరువ చేయవచ్చని నగర కమిషనరు కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. చెప్పారు. గురువారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వెల్ఫేర్ కార్యదర్శులు, మెప్మా ఆర్.పి.లు., సి.ఓ.లు, సి.ఎం.ఎం.లతో ప్రత్యేక సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పధకాలు అర్హులకు నేరుగా, వేగంగా అందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్తను అమలులోకి తెచ్చిందని, అందుకు తగిన విదంగా ప్రజలకు సేవ చేయాల్సిన భాద్యత సచివాలయ సిబ్బంది పై ఉందన్నారు. ప్రతి ప్రభుత్వ సంక్షేమ పధకం అమలులో సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శులకు ప్రధాన పాత్ర ఉంటుందని, వారికి ఇక నుండి మెప్మా ఆర్.పి.లు కూడా పూర్తీ సహకారం, భాగస్వామ్యం అందిస్తారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల్లో లబ్దిదార్లకు ఇళ్ళ నిర్మాణం చేసుకునేలా అవగాహన కల్గించాలన్నారు. డ్వాక్రా గ్రూప్ ల వారీగా సభ్యులైన లబ్దిదారులకు గ్రూప్ నుండి ఋణం ఇచ్చెందుకు తీర్మానాలు చేయాలని, అందులో ఆర్.పి.లు, సి.ఓ.లు భాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అలాగే సచివాలయాల వారీగా స్ట్రీట్ వెండర్స్ సర్వే పూర్తి చేసి, ఈ నెల 14 నాటికి రిపోర్ట్ ఇవ్వాలని, గుర్తించిన స్ట్రీట్ వెండర్స్ కు గుర్తింపు కార్డ్ లు, వెండింగ్ సర్టిఫికేట్స్, బ్యాడ్జీలు అందించి, ప్రత్యేకంగా వెండింగ్ జోన్స్ కూడా కేటాయిస్తామని తెలిపారు.
సమావేశంలో మెప్మా పి.డి. నారాయణ, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, మెప్మా సి.ఎం.ఎం.లు, సి.ఓ.లు, ఆర్.పి.లు, సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *