Breaking News

మానవ మనుగడకు కంటి చూపు ఎంతో ముఖ్యం… : డిఆర్ఓ వెంకటేశ్వర్లు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
మానవ మనుగడకు కంటి చూపు ఎంతో ముఖ్యమని , కనుదృష్టి కోల్పోతే సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ఆస్వాదించలేమని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన బెరాకా మినిస్ట్రీస్ హైస్కూల్ వసతిగృహం క్యాంపస్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్వో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మానవ గుణాలలో ఉత్తమమైనది సేవా గుణం అని అది ఎంతో ఉన్నతమైనదని, సాటి మనిషికి సహాయపడే లక్షణం భగవంతుడు సైతం మెచ్చుతారని అన్నారు. తర్వాత బెరాకా మినిస్ట్రీస్ పాఠశాలలో విద్యార్థులు కంటి పరీక్షలు నిర్వహించారు. దాదాపు 80 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులకు ఐ స్క్రీనింగ్ తర్వాత అవసరమైన వారికి కళ్ళజోడు ఉచితంగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. చిన్నారుల కంటి చూపులో జఠిలమైన లోపాలు ఉంటే వారికి శస్త్రచికిత్సలు సైతం ఉచితంగా నిర్వహించనున్నట్లు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ కృష్ణాజిల్లా చైర్మన్‌ డాక్టర్‌ తోట బాలాజీ తెలిపారు. జిల్లాలో ఉన్న గుర్తింపు పొందిన అన్ని చైల్డ్‌ కేర్‌ కేంద్రాలలో అనాధ బాలబాలికలకు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, ఎల్‌ వి ప్రసాద్‌ కంటి ఆసుపత్రి సహకారంతో పలుచోట్ల చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా బెరాకా మినిస్ట్రీస్ హైస్కూల్లో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.
అనంతరం బెరాకా మినిస్ట్రీస్ డైరెక్టర్ కిరణ్ పాల్ మాట్లాడుతూ, తెలివితేటలు ఉండి నిరుపేదలైన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడం ఎంతో బాధ్యతగా తీసుకున్నామని, అనాథలు, అన్నార్తులు, అవసరంలో ఉన్న వారికి ఆశ్రయం కల్పించి, విధ్య, ఆరోగ్యం, క్రమశిక్షణ, వసతి కల్పిస్తూ, భావి భారతమాత ముద్దు బిడ్డలుగా వారిని తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. బెరాకా మినిస్ట్రీస్ తరుపున ఈ రోజు 2 లక్షల 86 వేల రూపాయలను కేటాయించి 15 మందికి ఎడ్యుకేషనల్ స్పాన్సర్ షిప్పు , మరో ఇద్దరికీ ఒకొక్కరికి 20 వేల రూపాయల చొప్పున వైద్య సహాయం అందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సెక్రటరీ, రిటైర్డ్ మండల విద్యాశాఖాధికారి శంకర్‌ నాథ్‌ భవిరి, కోశాధికారి కొండపల్లి బాలాజీ, బెరాకా మినిష్ట్రీస్ వలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *