Breaking News

సంక్షేమ పథకాలు అమలులో ఆదర్శంగా జగనన్న: దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కులమత పార్టీలకతీతంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని పారదర్శకంగా అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో మిగతా ముఖ్యమంత్రి లకు ఆదర్శంగా నిలుస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ ,11వ సచివాలయం పరిధిలోని కామినేని నగర్ డొంక రోడ్డు, గ్యాస్ గౌడౌన్ రోడ్డు ప్రాంతాల్లో సచివాలయం సిబ్బంది, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఈ ప్రాంతంలో రోడ్లు అన్ని కూడా కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి వేయడం జరిగిందని అన్నారు.నాడు దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరిగింది,మరలా ఇప్పుడు మా హయాంలో మాత్రమే జరుగుతుంది అని ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాకు బ్రహ్మరథం పడుతున్నారు అని తెలిపారు. భౌగోళికంగా, జనాభా పరంగా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఈ 3వ డివిజన్ పెద్దది అని,గత తెలుగుదేశం ప్రభుత్వం లో అసలు ఈ డివిజన్ అభివృద్ధి గురుంచి పట్టించుకోలేదని విమర్శించారు. అందుకె మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు వైస్సార్సీపీ పార్టీకి పట్టం కట్టరాని వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రవల్లిక ఇక్కడి పెద్దలు అందరి సహకారంతో సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ అందరికి పధకాలు అందేలా కృషి చేస్తున్నారు అని,నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని అన్నారు.ఇంకా ఎవరికైనా ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పథకాలు అందకపోతే ఈ పర్యటన లో మా దృష్టికి తీసుకువస్తే వెంటనే సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 3వ డివిజన్ కార్పొరేటర్ భిమిశెట్టి ప్రవల్లిక, కో ఆప్షన్ మెంబెర్ ముసునూరు సుబ్బారావు, వైస్సార్సీపీ నాయకులు గౌస్, కోటి రెడ్డి, ఏనుగంటి రమాదేవి, కాజా, రాజేష్, రాజు, డేవిడ్ రాజు,కిస్సి,అనిల్, నాంచారయ్య, జమ్ముల ప్రసాద్, భీమిశెట్టి నాని తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *