Breaking News

గాంధీ దేశం సోషల్ వేల్ఫర్ ట్రస్టు ఆధ్వర్యంలో గాంధీహిల్ పైకి శాంతి యాత్ర…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ 43 వ డివిజన్ ఊర్మిళ నగర్ లో గాంధీ మహాత్ముని జయంతి సందర్భంగా ఆదివారం గాంధీ దేశం సోషల్ వేల్ఫర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ ఆధ్వర్యంలో శాంతి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ మహాత్ముని ఆశయాలు, సిద్ధాంతాలు ప్రతి ఒక్కరూ అమలు చేయాలని పిలుపునిచ్చారు. అసత్యాలు మాని నోటుకి ఓటు మాని ప్రతిఒక్కరు స్వచ్ఛంద వైఖరితో రాష్ట్ర కోసం, దేశం కోసం పాటుపడాలన్నారు.అలాగే అంబెడ్కర్ ఆశయాలు తూట్లు పడకుండా పాలకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలన అందించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై రాజకీయాలకు అతీతంగా ప్రతి తెలుగు బిడ్డలూ రాజకీయ నాయకులు, పౌరులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నేటి గాంధీ నాగరాజన్ పిలుపునిచ్చారు. తొలుత ట్రస్ట్ కార్యాలయం వద్ద గాంధీ చిత్రపటానికి, అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేటి గాంధీ కి ట్రస్ట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భారతి గాంధీ నాగరాజన్ కి రాట్నం బహుకరించారు. అనంతరం శాంతి పాదయాత్ర సాగింది. 43 వ డివిజను నుండి భావానిపురం చర్చి సెంటర్, సితార సెంటర్, సొరంగం, కొత్తపేట రోడ్డు, గణపతిరావు రోడ్డు, రైల్వే వెస్ట్ బుకింగ్, నుండి గాంధీహిల్ పైకి ఈ యాత్ర సాగింది. అక్కడ గాంధీ స్తూపం వద్ద జరిగిన గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ వేషధారణ లో చిన్నారులు ఈ యాత్రలో పాల్గొన్నారు. అలాగే పలువురు బాలికలు మదర్ థెరిస్సా, దేశ నాయకురాళ్ల వేషధారణ లో నేటి గాంధి శాంతి యాత్రను అనుసరించారు. ఈ యాత్రకు దారి పొడవునా స్థానికులు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో గాంధీ నాగరాజన్ తో పాటుగా భాపతి భారతి, శివరంజని ట్రస్ట్ మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *