విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అందుకు నిదర్శనమే గడపగడపకు వస్తున్న వైస్సార్సీపీ నాయకులకు బ్రహ్మరథం పడుతు స్వాగతం పలకడమే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ 23వ సచివాలయం పరిధిలోని గుణదల మేరీ మాత చర్చ్ రోడ్,మదర్ తెరిస్సా రోడ్,కోరి రోడ్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారికి అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేసారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం లో కొండ అంచున ఉన్న మా దగ్గరకు ఎవరు రాలేదని అసలు మా గురుంచి పట్టించుకోలేదు అని కానీ నేడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సచివాలయ సిబ్బంది, వలంటీర్ లు,వైసీపీ నాయకులు నిత్యం మాకు అందుబాటులో ఉంటూ మా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. నగరంలోనే అతి పెద్ద సచివాలయం అయిన ఈ ప్రాంతంలో మొదటి నుండి కూడా స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి, దేవినేని నెహ్రూ గారికి మద్దతుగా ఉండేవారని నేడు అదే అభిమానం జగన్ మీద ,వైస్సార్సీపీ మీద చూపిస్తున్నారని అన్నారు.అందుకే గతంలో ఎవరూ చేయని విధంగా కొండ ప్రాంత అభివృద్ధి కి కోట్ల రూపాయలు వెచ్చించి నూతన మెట్ల మార్గాలు,మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని అన్నారు.ఈ సచివాలయం పరిధిలో 3000 కుటుంబాలు ఉంటే దాదాపు 2300 కుటుంబాలు ఈ ప్రభుత్వం ద్వారా లబ్ది పొందాయని తెలిపారు. ఒకపక్క జనరంజక పాలన అందిస్తూ జగనన్న దేశంలో మిగతా ముఖ్యమంత్రి లకు ఆదర్శంగా నిలుస్తుంటే, దిక్కుతోచని తెలుగుదేశం నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ తమ అనుకూల మీడియా ద్వారా ప్రభుత్వం మీద కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు అని అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని మరోసారి జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వం రాకపోతే తరువాత వచ్చేవారు ఈ సంక్షేమ పథకాలు అన్ని ఆపేస్తారని ప్రజలలో భయాందోళనలు ఉన్నాయని అందుకే వారు ఖచ్చితంగా వైసీపీ కె మద్దతు గా నిలుస్తున్నారు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కో ఆప్షన్ మెంబెర్ ముసునూరి సుబ్బారావు వైస్సార్సీపీ నాయకులు డేవిడ్ రాజు,మాతంగి రాజేష్,జోషి,యాకుబ్ రాజు,గోల్డ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News