-జన చైతన్య వేదిక
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సమాగ్రాభివృద్ధిపై త్వరలో గుంటూరు నగరంలో రాష్ట్రస్థాయి సెమినార్ ను నిర్వహిస్తున్నట్లు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.గుంటూరులోని జన చైతన్య వేదిక కార్యాలయ హాలులో వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సభ జరిగింది.
ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్లో విద్య,వైద్యం,వ్యవసాయం,పరిశ్రమలు,వ్యవస్థాపక సౌకర్యాలు,ఉపాధి కల్పన పై వివిధ రంగాల నిపుణులను,ప్రజా సంఘాల నేతలను,అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర నేతలను ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ సమాగ్రాభివృద్ధిపై రాష్ట్రస్థాయి సెమినార్ ను నవంబర్ లో నిర్వహిస్తున్నామని అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలలో ఆయా జిల్లాల సమగ్రాఅభివృద్ధిపై జిల్లా స్థాయి సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 ని పునరుద్ధరించి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రివర్యులు,శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం తెలుగు ప్రజలు పోరాడి మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్టం ను 1953 అక్టోబర్ 1న ఏర్పాటు చేసుకున్నామని విశాలాంధ్ర ఉద్యమ ఫలితంగా తెలుగు వారందరూ కలిసి ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని 1956 నవంబర్ 1న ఏర్పాటు చేసుకోవడం చారిత్రాత్మకమైనదన్నారు.
శాసనమండలి విప్ జంగా కృష్ణమూర్తి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత మూడు సంవత్సరాల కాలంలో పరిపాలన వికేంద్రీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తూ వలంటీర్ వ్యవస్థ, సచివాలయాలను,26 జిల్లాల ఏర్పాటుతో పాటు సంక్షేమ పథకాలను కోట్లాదిమంది ప్రజలకు చేరుస్తున్నారని వివరించారు.
శాసనమండలి సభ్యులు కే.ఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు.తెలుగు రాష్టాలు విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి కావటానికి రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యంగా కృషి చేయాలన్నారు. తొలుత అతిధులందరూ అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి, దీక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు యడ్లవల్లి కృష్ణ, రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ పి.రామచంద్రరాజు, జన చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి సలీం మాలిక్, జన చైతన్య వేదిక కార్యదర్శి కంది పున్నారెడ్డి, వైస్సార్సీపీ నేతలు ఆనం సంజీవ రెడ్డి, తుల్లూరు సూరిబాబు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతి రావు, ప్రముఖ సాహితివేత్త డాక్టర్ వి.శింగరావు లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News