గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ తాలూకా యూనిట్, గన్నవరం ఎన్నికల నైపద్యంలో శుక్రవారంనాడు స్థానిక తహసిల్దార్ కార్యాలయం పక్కన గల ఏపీ ఎన్జీఓస్ హోమ్ కు ఎన్నికల బృందం విచ్చేసారు. ఎన్నికల అధికారి యం రాజుబాబు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్ నకలు ను స్థానిక ఎన్జీఓస్ హోమ్ నందు అతికించారు. అలాగే స్థానిక నాయకులకు అందజేసారు. గన్నవరం తాలూకు యూనిట్ సంబంధించి 11 పోస్టులు ఉన్నాయన్నారు. అధ్యక్షుడు-1, సహద్యకుడు-1, ఉపాధ్యక్షులు-3, కార్యదర్శి-1, సంయుక్త కార్యదర్శిలు-3, సంయుక్త కార్యదర్శి (మహిళ)-1, కోశాధికారి-1, మొత్తం 11 పోస్టులన్నారు. 242 మంది సభ్యులతో కూడిన ఓటర్ జాబితాను అందజేయ్యడం జరిగిందని అలాగే ఓటర్ల జాబితాలో లేని ఓటర్ల పేర్లను ఈనెల 17వ తారీఖులోపు నమోదు చేయించుకోవచ్చన్నారు. 21న నామినేషన్లు పక్రియ, 28న ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికల అధికారితో పాటుగా సహాయ ఎన్నికల అధికారి యువి పురుషోత్తమరాజు, ఎన్నికల పర్యవేక్షకులు డి విశ్వనాధ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జి రామకృష్ణ, స్థానిక ఎన్జీఓస్ నాయకులు వి సాంబశివరావు, వి వంశీ మోహన్, యం రవి, సురేంద్ర, యంవి రామాంజనేయులు, బిహెచ్ మోహన్ లక్ష్మీ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News