Breaking News

విజయవాడ ఈస్ట్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా తూర్పు నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్  ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో మరియు యనమలకుదురు కే కే గ్రౌండ్స్ నందు ఈ నెల 12వ తారీకు నుంచి 21 వ తారీకు వరుకు విజయవాడ ఈస్ట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వైస్సార్సీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు తెలిపారు. మంగళవారం ఆయన కార్యాలయంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లతో కలిసి వైయస్ జగన్ ఈస్ట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ను బుచ్చిబాబు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో మనో ఉల్లాసాన్ని, సమైక్యతను పెంపొందిస్తాయని నియోజకవర్గంలో ని డివిజన్ లలో ఆసక్తి గలవారు టీమ్స్ గా ఏర్పడి రిజిస్టర్ చేసుకున్నారని గెలిచిన జట్టుకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయల బహుమతి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *