విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణిని తనిఖీ చేయడానికి ఓపెన్ మార్కెట్ సిల్ స్కీమ్ (డొమెస్టిక్) కింద 30 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విడుదల చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, నామినేటెడ్ ఎఈఒ డిపోల నుండి ఒక్కో డిపోకు ఒక్కొక్కరికి చొప్పున్న 1 నుండి 9 మెట్రిక్ టన్నులు వరకు చిన్న (ప్రైవేట్) వ్యాపారులకు గోధుమలను విక్రయించడానికి రిటైల్ స్కీమ్ లో సదుపాయం కల్పించబడిందన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ చంద్ర శేఖర్ జోషి శుక్రవారం రాష్ట్ర పిండి మిల్లుల సంఘం, ఇతర పిండి మిల్లర్ల ప్రతినిధులు, ప్రైవేట్ వ్యాపారులు, బల్క్ కొనుగోలుదారులు, గోధుమ ఉత్పత్తుల తయారీదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కింద టెండర్ ద్వారా గోధుమ, బియ్యం అమ్మకానికి సంబంధించిన పాలసీ గురించి చర్చించారు.
Prajavartha Online Telugu News