తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామస్థాయిలో సమగ్ర పశు గణన నిబద్ధతతో చేపట్టాలి అని కేంద్ర పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమాభివృద్ధి ముఖ్య కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో స్థానిక పశు వైద్య విశ్వవిద్యాలయంలో తొమ్మిది దక్షిణాది రాష్ట్రాలలోని పశు గణ జిల్లా నోడల్ అధికారులకు గురువారం రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం, కేంద్ర పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమాభివృద్ధి ముఖ్య కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ రూపకల్పన,ప్రణాళికలు చేసేందుకు సమగ్ర సర్వే ఎంతో ఉపకరిస్తుందని, నిబద్ధతతో కూడిన పశు గణన పాలు,గుడ్లు,మాంసం ఉత్పత్తుల గణనీయమైన అభివృద్ధికి దోహదపడుతుందని, ఇందుకు ఈ సాఫ్ట్ వెర్ పై జిల్లా నోడల్ అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాలని పిలుపునిచ్చారు.
గ్రామస్థాయిలో చేపట్టే సమగ్ర పశు గణన ఎంతో ప్రాధాన్యత తో కూడుకున్నదని, దీని వల్ల దేశంలో పశు ఉత్పత్తులపై సమాచారాన్ని, దేశ ప్రగతిలో ప్రాముఖ్యత ను గుర్తించి రైతులకు మరింత సహకారాన్ని అందివచ్చని కేంద్ర మంత్రిత్వ సలహాదారు సుమీద్ సోపాన్ నగ్రరే అన్నారు.
డా.అమరేంద్రకుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పశు సంవర్ధక శాఖ ప్రగతిని,పశు వైద్య అంబులెన్స్, రైతు భరోసా కేంద్రాల ప్రత్యేకతలను వివరించారు.ఈ కార్యక్రమంలో సమగ్ర సర్వే ముఖ్య శాస్త్ర వేత్త శ్రీమతి ప్రాచీ మిశ్రా,ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డా.అమరేంద్ర కుమార్,తిరుపతి జిల్లా పశు సంవర్ధక అధికారి డా.రవికుమార్ , డా.శ్రీనివాస రాజు, రాష్ట్రా మరియు జిల్లాల నోడల్ అధికారులు పాల్గొన్నారు. దేశంలో 6 జోన్ ల విభజించి ఈ శిక్షణ చేపతున్నామని, మొదటిగా దక్షిణ జోన్ లో తిరుపతిలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
అఖిల భారత సమగ్ర నమూనా పశు గణ సర్వే (ఇంటిగ్రేటెడ్ సెంపిల్ సర్వే స్కీం) లో భాగంగా నూతనంగా రూపొందించిన సాఫ్ట్ వెర్ లో పశు గణన ను గ్రామస్థాయిలో ఎలా నిర్వహించాలి, ఎలా అంతర్జాలం లో నమోదు చెయ్యాలో యాప్ నిష్ణాతులతో ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,కర్ణాటక, కేరళ,తమిళనాడు, గోవా,అండమాన్ నికోబార్, లక్షదీప్,పుదుచ్చేరి రాష్ట్రాల జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News