Breaking News

లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ విధానం ద్వారా ఉచిత న్యాయ సహాయం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న వసతులను ఆమె పరిశీలించారు. ఖైదీల కోస ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన బెయిల్ ఆదేశాలను గురించి వారికి వివరించడం జరిగింది. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ విధానం ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఖైదీలకు/ముద్దాయిలకు అందిస్తున్న న్యాయ సేవల గురించి ప్రత్యూష కుమారి వివరించారు. ముద్దాయికి అవసరమైన ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, ఉచిత న్యాయ సహాయం పొందడం వారి హక్కు అని తెలియజేశారు. ఖైదీలకు, ముద్దాయి లకు అందచేస్తున్న వైద్య సేవలు గురించి కారాగారం నందు పని చేస్తున్న వైద్యులతో మాట్లాడారు. అక్కడున్న వైద్య సదుపాయాలు, ఖైదీల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. వసతులు, సదుపాయాల విషయంలో ఏ విధమైన అవసరాలు ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకు రావాలని వారికి సూచించారు. ఈ సందర్భం గా జైల్ సూపరింటెండెంట్ ఎస్. రాజారావు, జైల్ అధికారులు, మెడికల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *