గయాజుద్దీన్ ఆధ్వర్యంలో వేలాది మందికి ఇఫ్తార్ విందు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం సాయంత్రం భవానిపురంలోని మసీదే రజా వీధిలోని మసీదు వద్ద వేలాది మంది ముస్లిం సోదరులకు ఐజా గ్రూప్ చైర్మన్, జనసేన నగర అధికార ప్రతినిధి షేక్ గయాజుద్దీన్ (ఐజా) ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తమ ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నామన్నారు. ఈ ఇఫ్తార్ విందులో సుమారు 15 వేల మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారని చెప్పారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు ఎంతో నిష్టగా అల్లాహ్ ను జరుగుతుందని,వారికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఐజా చెప్పారు. రాష్ట్ర అధికార ప్రతినిధి అబ్దుల్ నయీబ్ కమాల్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. కాగా ఇఫ్తార్ విందు సందర్భంగా ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం కనిపించింది. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొని ఐజాను అభినందించారు. అలాగే పలువురు జనసేన పార్టీ నాయకులు, అభిమానులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *