Breaking News

అర్హులైన అందరికీ పథకాలు అమలు చేస్తున్నాం : హోం మంత్రి తానేటి వనిత

-8వ వార్డు …గడప గడపకు లో స్వహస్తలతో టి అందించిన హోం మంత్రి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ప్రతి ఒక్కరికీ కుల, మత, వర్గ, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 96వ రోజు కొవ్వూరు పట్టణం 8వ వార్డులో ఆదివారం నాడు హోంమంత్రి పర్యటించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో రోడ్డు పక్కన టీ స్టాల్ నడుపుతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి యోగ క్షేమాలు కనుక్కొని, ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న సంక్షేమాన్ని వివరించారు. టీ దుకాణంలో వేడి వేడిగా టీ కాచి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి, ప్రజలకు హోం మంత్రి స్వహస్తాలతో అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఈ మూడున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. మాట తప్పని, మడమ తిప్పని మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను చేసి చూపిస్తున్న ఘనత సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను తన పాదయాత్ర సమయంలో తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను అమలు చేసి చూపిస్తున్నారని కొనియాడారు. చెప్పినవే కాకుండా చెప్పని హామీలను కూడా చేసి చూపిస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. అందుకే ప్రజలందరూ ముఖ్యమంత్రికి జననీరాజనం పలుకుతున్నారన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం రూపొందించారని ఆమె తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని సచివాలయ సిబ్బంది, అన్ని శాఖల అధికారులను హోంమంత్రి తానేటి వనిత ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *