పారిశుధ్య నిర్వహణ మరియు డ్రెయిన్లలో మురుగునీటి పారుదల విధానం పరిశీలన

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలం మొదలవ్వక ముందే మురుగు కాలువల్లో సిల్ట్ తొలగించే ప్రక్రియ నూరుశాతం పూర్తి అవ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ శనివారం అధికారులతో కలిసి పశ్చిమ నియోజక వర్గం పరిధిలోని 53 వ డివిజన్ కొత్తపేట గాంధీహిల్ ప్రక్కన అవుట్ ఫాల్ డ్రెయిన్ మరియు 34 వ డివిజన్ కేదారేశ్వరపేట గుంట కాలనీ మొదలగు ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ మేజరు అవుట్ ఫాల్ డ్రెయిన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ప్రధాన మరియు అంతర్గత రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు సైడ్ డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల విధానము పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.

అదే విధంగా 53 వ డివిజన్ కొత్తపేట గాంధీహిల్ ప్రక్కన అవుట్ ఫాల్ డ్రెయిన్ కు ఏర్పాటు చేసినటువంటి ఐరన్ స్క్రీన్ ను పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణకు అవరోధoగా కాలువల మీద ఆక్రమణలను తొలగించుట, డ్రెయిన్స్ నందు పూర్తి స్థాయిలో సిల్ట్ తొలగించుట, కాలువలలో చెత్త వ్యర్ధపదార్దములు పడకుండా చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ఇంజనీరింగ్, ప్రజారోగ్య మరియు పట్టణ ప్రణాళికా విభాగము వారు సమన్వయంతో పని చేసి రోడ్లపై నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి మ్యాన్ హోల్, కల్వర్ట్ మూతలు తీసి శుభ్రపరచి, నీటి పారుదల సక్రమముగా ఉండునట్లుగా చూడాలని ఆదేశించారు.

తదుపరి 34 వ డివిజన్ కేదారేశ్వరపేట గుంట కాలనీ మొదలగు ప్రాంతాలలో ఆయా మేజరు అవుట్ ఫాల్ డ్రైయిన్స్ లో సిల్ట్ తొలగింపు పనులు యుద్దప్రాతిపధికన చేపట్టి మురుగునీరు సక్రమముగా ప్రవహించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రెయిన్ నందు సిల్ట్ తొలగించు సమయంలో వాహనములను ఏర్పాటు చేసి నేరుగా అక్కడ నుండి సిల్ట్ తొలగించాలని సూచించారు.

సైడ్ డ్రెయిన్లలో మురుగునీటి పారుదలకు అవరోధకరంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించి డ్రెయిన్ల ద్వారా మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చూడాలని అన్నారు. డివిజన్ పరిధిలో మంచినీటి సరఫరా విధానమునకు సంబందించి వాటర్ పైప్ లైన్ లీకేజిలు లేకుండా చూడాలని మరియు యు.జీ.డి నందలి మురుగునీటి పారుదలలో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ మూర్తి, ప్రజారోగ్య అధికారులు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *