-జూన్ 12 సోమవారం స్కూల్స్ ప్రారంభించే రోజున పంపిణీ చర్యలు
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 12, 2023న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న దృష్ట్యా “జగనన్న విద్యా కానుక” కిట్లు ఆయా పాఠశాలలు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 990 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1,21,730 మంది విద్యార్థిని , విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్స్ పంపిణీ చర్యలు తీసుకోవడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 712 ప్రాథమిక పాఠశాలల్లో, 82 ఉప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో , 201 ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 59370 బాలురకు, 62360 బాలికలకు జె.వి.కే కిట్స్ పంపిణీ కి సిద్దంగా ఉన్నామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. కిట్ లో ఒక జత యూనిఫారం, బూట్లు, సాక్స్ లతో పాటు నోట్‌బుక్‌లు, వర్క్‌బుక్‌లు, ఒక నిఘంటువు, ఒక బెల్ట్ మరియు ఒక బ్యాగ్ అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో విద్యార్థులకు అందచేస్తున్న జే వి కె. కిట్ల కోసం సుమారు రూ.30 కోట్లకు పైగా నిధులు ప్రభుత్వం చెల్లించి కిట్లు పంపిణీ చేయడం జరుగుతోందని అన్నారు.
జూన్ 12 సోమవారం పాఠశాలలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా అన్ని మండల ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, తహశీల్దార్లు మండలాల్లోని పాఠశాలలను సందర్శించి, ధృవీకరించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఆమేరకు తనిఖీకి చేపట్టినట్లు జెసి ఎన్ .తేజ్ భరత్ పేర్కొన్నారు. ఆయా పాఠశాలలు సందర్శన లో జేవికే స్టాక్ లభ్యత మరియు పాఠశాలల ప్రారంభానికి తరగతి గదుల సంసిద్ధత, ఇతర మౌలిక సదుపాయాలు పై నివేదిక అందచెయ్యడం జరిగిందన్నారు.
జిల్లా విద్యా అధికారి ఎస్. అబ్రహం మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించే సామర్థ్యం కలిగి ఉండడమే కాకుండా, స్కూల్స్ తెరిచే రోజున జగనన్న విద్యా కానుక కిట్స్ పంపిణీ చేయడం కోసం మండల స్థాయి స్టాక్ పాయింట్ నుంచి ఆయా స్కూల్స్ కు తరలించే ఏర్పాట్లు ను ఆయా మండల విద్యా అధికారులు చూడడం జరిగిందన్నారు. ఒకొక్క జేవికే కిట్ రూ.2500 లను వెచ్చించి అత్యంత నాణ్యత పరిణామాలతో కూడి పంపిణీకి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
మండలాలు వారీగా అందచెయ్యనున్న జే.వి.కే. కీట్స్ అందుకోనున్న విద్యార్థుల వివరాలు:
అనపర్తి మండలం – 34 ప్రైమరీ / 0- యూ పీఏస్ / 10 ఉన్నత పాఠశాల లో మొత్తం 44 స్కూల్స్ లో 4795 మంది (బాలురు 2626 / బాలికలు 2169)
బిక్కవోలు మండలం – 30 ప్రైమరీ / 1 యూ పీఏస్ / 8 ఉన్నత పాఠశాల లో మొత్తం 39 స్కూల్స్ లో 4266 మంది (బాలురు 2081 / బాలికలు 2185 )
రంగంపేట మండలం – 34 ప్రైమరీ / 4 యూ పీఏస్ / 10ఉన్నత పాఠశాల లో మొత్తం 48 స్కూల్స్ లో 4653 మంది (బాలురు 2235 / బాలికలు 2418 )
రాజానగరం మండలం – 39 ప్రైమరీ / 8 యూ పీఏస్ / 14 ఉన్నత పాఠశాల లో మొత్తం 61 స్కూల్స్ లో 7282 మంది (బాలురు 3561 / బాలికలు 3721 )
కోరుకొండ మండలం – 35 ప్రైమరీ / 6 యూ పీఏస్ / 15 ఉన్నత పాఠశాల లో మొత్తం 55 స్కూల్స్ లో 7,300 మంది (బాలురు 3558 / బాలికలు 3742 )
సీతానగరం మండలం – 43 ప్రైమరీ / 7 యూ పీఏస్ / 7 ఉన్నత పాఠశాల లో 57 మొత్తం స్కూల్స్ లో 5,004 మంది ( 2438 బాలురు / 2566 బాలికలు )
కడియం మండలం – 40 ప్రైమరీ / 2 యూ పీఏస్ / 9 ఉన్నత పాఠశాల లో మొత్తం 51 స్కూల్స్ లో 5,711 మంది (బాలురు 2847 / బాలికలు 2864 )
రాజమహేంద్రవరం అర్బన్ మండలం – 60 ప్రైమరీ / 12 యూ పీఏస్ / 24 ఉన్నత పాఠశాల లో మొత్తం 86 స్కూల్స్ లో 17,232 మంది (బాలురు 8556 / బాలికలు 8676 )
రాజమహేంద్రవరం రూరల్ మండలం – 39 ప్రైమరీ / 5 యూ పీఏస్ / 15 ఉన్నత పాఠశాల లో మొత్తం 59 స్కూల్స్ లో 10,660 మంది (బాలురు 4715 / బాలికలు 5945 )
జగ్గంపేట నియోజక వర్గం – గోకవరం మండలం – 34 ప్రైమరీ / 11 యూ పీఏస్ / 8 ఉన్నత పాఠశాల లో మొత్తం 53 స్కూల్స్ లో 7,088 మంది (బాలురు 3584 / బలికలు 3504 )
దేవరపల్లి మండలం – 34 ప్రైమరీ / 2 యూ పీఏస్ / 9 ఉన్నత పాఠశాల లో మొత్తం 45 స్కూల్స్ లో 5,971 మంది (బాలురు 2819 / బాలికలు 3152 )
గోపాలపురం మండలం – 37 ప్రైమరీ / 5 యూ పీఏస్ / 11 ఉన్నత పాఠశాల లో మొత్తం 53 స్కూల్స్ లో 6042 మంది (బాలురు 2864 / బాలికలు 3178 )
నల్లజర్ల మండలం – 41 ప్రైమరీ / 4 యూ పీఏస్ / 9 ఉన్నత పాఠశాల లో మొత్తం 54 స్కూల్స్ లో 5,984 మంది (బాలురు 2964 / బాలికలు 3020 )
కొవ్వూరు మండలం – 36 ప్రైమరీ / 6 యూ పీఏస్ / 14 ఉన్నత పాఠశాల లో మొత్తం 56 స్కూల్స్ లో 6,913 మంది (బాలురు 3320 / బాలికలు 3593)
చాగల్లు మండలం – 30 ప్రైమరీ / 2 యూ పీఏస్ / 7 ఉన్నత పాఠశాల లో మొత్తం 39 స్కూల్స్ లో 4326 మంది (బాలురు 2140 / బాలికలు 2186 )
తాళ్లపూడి మండలం – 24 ప్రైమరీ / 2 యూ పీఏస్ / 6 ఉన్నత పాఠశాల లో మొత్తం 32 స్కూల్స్ లో 3754 మంది (బాలురు 1925 / బాలికలు 1829 )
నిడదవోలు మండలం 51 ప్రైమరీ / 8 యూ పీఏస్ / 11 ఉన్నత పాఠశాల లో మొత్తం 70 స్కూల్స్ లో 6709 మంది (బాలురు 3074 / బాలికలు 3635 )
ఉండ్రాజవరం మండలం 32 ప్రైమరీ / 0 యూ పీఏస్ / 8 ఉన్నత పాఠశాల లో మొత్తం 40 స్కూల్స్ లో 4,093 మంది (బాలురు 2050 / 2043 బాలికలు )
పెరవలి మండలం 39 ప్రైమరీ / 2 యూ పీఏస్ / 7 ఉన్నత పాఠశాల లో మొత్తం 48 స్కూల్స్ లో 3,947 మంది (బాలురు 2013 / బాలికలు 1934 )
Prajavartha Online Telugu News