Breaking News

కొండప్రాంత అభివృద్ధి వైసీపీ ప్రభుత్వ ఘనతే అని దమ్ముగా చెప్పగలం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే తూర్పు నియోజకవర్గ పరిధిలోని కొండప్రాంత అభివృద్ధి జరిగిందని, అక్కడ నూతన మెట్ల మార్గాలు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా ఏర్పాటు చేశామని దమ్ముగా చెప్పగలం అని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం 3వ డివిజన్ వైయస్సార్ కాలనీ, కనకదుర్గ నగర్, రామచంద్ర నగర్ ప్రాంతాల్లో దాదాపు 87లక్షల రూపాయల తో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి, పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ళ పాలనలో మేయర్, ఎంపీ, ఎమ్మెల్యేలు ఆ పార్టీ వాళ్లే ఉన్న సరే నగర అభివృద్ధి కి చేసింది ఏమి లేదు అని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే వందల కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్, ఫ్లై ఓవర్ లు, రోడ్లు, పార్కులు అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. చేశాం కాబట్టే దమ్ముగా ధైర్యంగా జనాల్లోకి వచ్చి చేసింది చెబుతున్నాం అని, మరి మీరు ఏమి చేశారో చెప్పగలరా అని తెలుగుదేశం నాయకులకు సవాల్ విసిరారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రచార యవతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప ఆయన నివాసం ఉండే డివిజన్ లో కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. మేము వారి లాగా శంకుస్థాపన లు చేసి వదిలేయకుండా పని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చేవరకు నిత్యం అధికారులను, ప్రజాప్రతినిధులను కలుస్తూనే ఉన్నామని అన్నారు.
-తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న దేవినేని అవినాష్ కు ప్రజలు మద్దతుగా నిలవాలి:మేయర్ రాయన భాగ్యలక్ష్మి
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో నేడు పార్కు ప్రారంభం గాని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాకుండా ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి కాలనీ వాసుల మంచినీటి సమస్య కు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అన్నారు.15వ ఆర్థిక సంఘం నిధులతో వీలైనంత త్వరగా పనులు మొదలుపెట్టి నిర్మాణం పూర్తి చేస్తామని మేయర్ హామీ ఇచ్చారు .నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా దేవినేని అవినాష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి అవుతున్నాయని తెలిపారు. నిత్యం ఏదో ఒక శంకుస్థాపన గాని, ప్రారంభోత్సవం గాని నియోజకవర్గంలో జరుగుతుంది అంటే అది అవినాష్ ఘనతే అని కొనియాడారు. మేము శంకుస్థాపన లు చేస్తుంటే ఆ చుట్టుప్రక్కల కాలనీ పెద్దలు వచ్చి ఎప్పుడో 15ఏళ్ల క్రితం రోడ్లు వేశారని మరలా ఇప్పుడు వేస్తున్నారు అని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని, దీనిని బట్టే గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఎలాంటి అభివృద్ధి జర్గాలేదని అర్థం అవుతుంది అని అన్నారు. అప్పుడు చేపట్టిన పనుల మరియు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయం లో చేపట్టిన పనుల వివరాలు కావాలంటే కార్పొరేషన్ ద్వారా అందిస్తామని మేము చేసిన అభివృద్ధి చెప్పే దమ్ము మాకుంది అని ధీమా వ్యక్తంచేశారు. నియోజకవర్గ అభివృద్ధి కి అనునిత్యం కృషి చేస్తున్న అవినాష్ కు ప్రజలందరూ మద్దతుగా నిలిచి ఆశీర్వదించలని భాగ్యలక్ష్మి కోరారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కో ఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు,వైస్సార్సీపీ నాయకులు భీమిశెట్టి నాని,డేవిడ్ రాజు,కోటేశ్వరరావు,సీతారామయ్య,నాంచారయ్య,కృష్ణకృష్ణ రావు,నారాయణరావు,భీమిశెట్టి బాబు,సాయి వినయ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *