కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
‘ఫిష్ ఆంధ్ర’ షాపుల ద్వారా స్థానికంగా తలసరి మత్స్య ఉత్పత్తుల వినియోగం పెంచడమే కాకుండా నాణ్యమైన, బతికిఉన్న, తాజా మత్స్య ఉత్పత్తులను ప్రజలకు అందించడం జరుగుతుందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గురువాంర హోంమంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం (పీఎంఎంఎస్‌వై) ద్వారా ఫోర్ వీలర్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కొవ్వూరు పట్టణంలోని శ్రీనివాసపురం బ్రిడ్జిపేటకు చెంది కర్రి రాహుల్ బాబుకు 20 లక్షల విలువైన ఫోర్ వీలర్ లైవ్ ఫిష్ ట్రాన్స్ ఫోర్ట్ వాహనాన్ని ఆమె అందించారు.. పీఎంఎంఎస్‌వై పథకం ద్వారా బతికి ఉన్న చేపలు, చేపల విత్తన రవాణా కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో ఈ వాహనం అందించడం జరిగిందని హోంమంత్రి తెలిపారు. మొత్తం 20 లక్షల విలువ గల ఈ వాహనంపై ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం సబ్సిడీ లభించడంతో 12 లక్షల సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతోందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …