విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక 4 మరియు 5 వ డివిజన్లలో నెల్సన్ మండేలా పార్కు, LIC కాలనీ, అరుళ్ నగర్, కమ్యూనిటి హాల్ నందు గల 16 మరియు 20 వార్డు సచివాలయాలను కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ శుక్రవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్పందన, జగనన్నకు చెబుదాం ఫిర్యాదులు, నాడు – నేడు పనుల పురోగతి, ఆస్థి పన్ను, యూజర్ చార్జీల వసూళ్ళను సచివాలయ కార్యదర్శులు వేగవంతం చేయాలని సూచించారు ప్రజలకు అందించే సేవల్లో నిబద్ధత పాటించాలని, తమకు నిర్దేశించిన పన్నుల వసూళ్ల లక్ష్యాలను గడువులోపు పూర్తిచేయాలని సూచించారు. జగనన్న కాలనీ లే అవుట్ల నిర్మాణం పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని అమెనిటీస్ కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు.స్థానిక 4 వ డివిజను నెల్సన్ మండేలా పార్కు, LIC కాలనీ సమీపంలో రేపు నిర్వహించనున్న “జగనన్న సురక్ష” కార్యక్రమ ఏర్పాట్లను కమిషనర్ గారు పరిశీలించారు. జగనన్న సురక్ష పథకం పారదర్శకంగా అందరికీ చేరువయ్యేలా ప్రతి సచివాలయం సెక్రెటరీ కృషి చెయ్యాలి అని కమిషనర్ సూచించారుతదుపరి 4 మరియు 5 వ డివిజన్లలో నెల్సన్ మండేలా పార్కు, LIC కాలనీ, అరుళ్ నగర్ పలు ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ప్రధాన మరియు అంతర్గత రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు సైడ్ డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల విధానము పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.ఈ సందర్భంలో ఆయా మేజరు అవుట్ ఫాల్ డ్రైయిన్స్ లో సిల్ట్ తొలగింపు పనులు యుద్దప్రాతిపధికన చేపట్టి మురుగునీరు సక్రమముగా ప్రవహించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సైడ్ డ్రెయిన్లలో మురుగునీటి పారుదలకు అవరోధకరంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించి డ్రెయిన్ల ద్వారా మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చూడాలని అన్నారు.ఈ పర్యటనలో జోనల్ కమిషనర్-3 ఎం.కృష్ణ, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.