-ఫ్యామిలీ కాన్సెప్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సర్వే చేపట్టడం జరుగుతోంది
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను నివారించే విధంగా వారి ఫ్యామిలీ కాన్సెప్ట్ డాక్టర్ సందర్శన లో ఆరోగ్యంపై దృష్టిని సారించి రోజువారీ ఆహారంలో విటమిన్లు సమృద్ధిగా ఉండేలా వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు.శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి విజయవాడ లోని సి ఎస్ క్యాంపు కార్యాలయం నుంచి వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, సుస్థిర అభివృద్ది లక్ష్యాలు, పాఠశాల విద్య, జగనన్నకు చేబుదాం వంటి అంశాల పురోగతిపై జిల్లాల వారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, జేసీ తేజ్ భరత్, ఇతర జిల్లా అధికారులు కలసి పాల్గొన్నారు.సిఎస్ కే.ఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా అమలు చేస్తున్న విద్య, వైద్యం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, జగనన్నకు చెబుదాం వంటి పథకాలను ప్రజలకు సంతృప్తి స్థాయిలో లక్ష్యసాధన అందేలా అధికారులు నిబద్దతతో పనిచేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సుస్థిర ఆరోగ్య పరిరక్షణ కోసం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద జిల్లాలో 17,52,547 మందికి గాను 14,33,551 మందికి ఐ డి లు రూపొందించడం జరిగిందని, మిగిలిన 18.2 శాతం త్వరితగతిన పూర్తి చెయ్యాలన్నారు. పి.హెచ్.సి పరిధిలో 640 మంది ఏఎన్ఎమ్ లకు గాను 575 డేటా సేకరణ చేపట్టడం జరుగుతోందని అన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ కార్యక్రమంలో 100646 కు గానూ 18627 మంది బిపి, 109889 మందిలో 16174 మంది సుగర్ లక్షణాలు గుర్తించడం జరిగిందన్నారు. తీవ్ర పౌష్టిక ఆహార లోపం ఉన్న 6 నెలల నుంచి 6 సం. ములు లోపు పిల్లలకు బంగారుకొండ కార్యక్రమం ద్వారా గుర్తించామన్నారు. వారిని దత్తత తీసుకుని 1283 కిట్లను అందించి, ఆరు నెలలపాటు పర్యవేక్షణ చేసే విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు.యాంటెనాటల్ కేర్ కి చెందిన 9058 కి గాను 8817 మందిని, ప్రసవానంతర సంరక్షణ 2717 కు గానూ 2673 మందిని, రక్త హీనత కలిగి ఉన్న 257 మందికి గాను 246 మందిని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద పరిక్షలు నిర్వహించినట్లు తెలిపారు.జిల్లాలో నాడు నేడు కింద నిర్వహిస్తున్న పనుల పురోగతిపై కలెక్టర్ మాధవీలత వివరిస్తూ, ఫేజ్ -2 కింద జిల్లాలో 655 స్కూల్స్ లో వివిధ పనులను, నిర్మాణాలను చేపట్టడం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 279 స్కూల్స్ లో 1410 అదనపు తరగతి గదులు, 175 కాంపౌండ్ వాల్స్, 433 మరుగుదొడ్లు, 312 వంట గదుల నిర్మాణాలు చేపట్టడం జరుగు తోందన్నారు. ఇందులో భాగంగా 444 మేజర్ పనులు, 433 విద్యుత్ పనులు జరుగు తున్నాయని అన్నారు. డిజిటల్ పరిజ్ఞానం తో కూడిన బోధన కోసం 148 స్కూల్స్ లో ఐ ఎఫ్ పి స్క్రీన్స్, 240 టివి లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.జగనన్న కు చెబుదాం కింద 2904 ఆర్జిలు రాగా వాటిలో 2096 పరిష్కారం చేసినట్లు, 652 పరిశీలనలో ఉన్నాయన్నారు. రీ ఓపెన్ అయిన 195 కు చెంది వ్యక్తిగత పరిశీలన కోసం చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. జిల్లా పరిధిలో పంచాయతీ రాజ్ కు చెందిన 535, పోలీస్ 469, రెవెన్యూ 397 , విద్యుత్ సంస్థ 359, హౌసింగ్ కి చెందిన 193 అత్యధిక అర్జీలు వచ్చాయని అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ , డీఆర్వో జి. నరశింహులు, సీపీఓ ఏ. ముఖలింగం, ఆర్ఐఒ ఎమ్. సుబ్రహ్మణ్యం, డిఎల్ఏ అధికారిణి డా. ఎన్. వసుందర, డిఆర్డిఏ పీడి ఎస్. సుభాషిణి, డిఈఒ ఎస్. అబ్రహం, డి ఎమ్ హెచ్ ఒ డా. కే. వెంకటేశ్వరరావు, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డా. పి ప్రియాంక, పలువురు జిల్లా శాఖా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News