మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహం ఆవిష్కరణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం పల్లపొతు మురళి కృష్ణ, కొనకళ్ళ విద్యాధర రావు, అధ్వర్యంలో విజయవాడ నదిపొడ్డు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామీ, రోశయ్య కొడుకు అల్లుడు ఎమ్మెల్యే మద్దలి గిరి తదితర ఆర్యవైశ్య ప్రముఖులు కలిసి ఆవిష్కరించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఆర్యవైశ్య కులానికి వన్నె తెచ్చిన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు. విజయవాడలో కాంశ్య విగ్రహం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా వైశ్యులు పాల్గొన్నారన్నారు. మహాసభ ను ఏర్పాటు చేసిన వ్యక్తి రోశయ్య అని అన్నారు. ఆయన స్పూర్తితో పని చేస్తున్నామన్నారు. ఆయన ఆశయ లకు అనుగుణంగా నడుస్తామని తెలిపారు. వెలంపల్లి మాట్లాడుతూ ఈ నెల 4న రోశయ్య జయంతి సందర్భంగా ఈ రోజు ఆయన విగ్రహం ఆవిష్కరించుకోడం జరిగిందన్నారు. రోశయ్య విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషం గా వుందన్నారు. 17 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు.అందరూ పెద్దాయన అని పీల్చుకునే వ్యక్తి రోశయ్య అని తెలిపారు. వారి స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలన్నారు. ఆయన ఆర్యవైశ్య కులానికి ఒక దిక్సూచి అని తెలిపారు.ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడుస్తున్నట్లు తెలిపారు.ఆయన ఆజాత శత్రువు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసన మండలి సభ్యులు అన్నా రాంబాబు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్,నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,రోశయ్య గారి కుమారుడు కొణిజేటి శివ సుబ్బారావు,అల్లుడు పైడా కృష్ణ ప్రసాద్,రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ముక్కాల ద్వారకా నాథ్,రేపాల శ్రీనివాసరావు,గుబ్బా చంద్ర శేఖర్,కుప్పం ప్రసాద్,మెట్టమళ్ళీ రమేష్,పెనుగొండ సుబ్బారాయుడు,పోతుల సురేష్,గుడివాడ గున్నయ్య సెట్టి,ఒబిలి సెట్టి కనకరాజా,రాజా,విజయవాడ కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర, మండేపూడి చటర్జీ, చెన్నగిరి రామ్మోహన్ తదితర ఆర్యవైశ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *