మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం పి. రాజాబాబు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ తమ ఛాంబర్ నందు గోడ ప్రతులను ఆవిష్కరించినారు . ఈ సందర్భంగా జిల్లాలో శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతి అయిన వ్యాసెక్టమి పాటించిన విశ్వనాథపల్లి రాము దంపతులకు , తాత్కాలిక పద్ధతులైన పిపిఐయుసిడి పాటించిన బద్వేలు లావణ్య , దాసరి జ్ఞాన పుష్ప దంపతులకు మరియు అంతర్ ఇంజక్షన్ వాడిన గర్ల జ్యోతిర్మయి దంపతులకు ప్రశంసా పత్రం తో పాటు ఐదు వేల రూపాయలు నగదు పారితోషకాన్ని అందించుట జరిగింది . అదేవిధంగా కుటుంబ సంక్షేమ కార్యక్రమా అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వైద్యాధికారులు డాక్టర్ ఎన్. లీలా ప్రియదర్శిని, డాక్టర్ వై . అనిత ,డాక్టర్ పి హరి రంగ ప్రసాద్ లకు మరియు క్షేత్రస్థాయిలో పి . వాణి ,పి . ప్రశాంత్ కుమారి మహిళ ఆరోగ్య కార్యకర్తలకు కే. సుధారాణి ,వి . కిరణ్మయి ఆశా కార్యకర్తలకు కూడా ప్రశంసా పత్రం తో పాటు నగదు పారితోషికాలను అందించడం జరిగింది . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ అధికముగా పెరుగుతున్న జనాభా వలన కలిగే సమస్యలు మరియు ఆరోగ్యకరమైన మరియు సంతోషంగా జీవించే చిన్న కుటుంబాల ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన కల్పించడానికి తగిన సేవలు సలహాలు అందించవలసినదిగా వైద్యారోగ్య శాఖ వారిని ఆదేశించడం జరిగింది.
ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి తమ కార్యాలయం నుండి ర్యాలీని ప్రారంభించారు . ఈ ర్యాలీలో కార్యాలయ సిబ్బందితోపాటు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల , గ్రేస్ కాలేజీ ఆఫ్ నర్సింగ్ సంస్థల విద్యార్థునులు ప్లే కార్డులు ధరించి పాల్గొన్నారు .ఈ సందర్భంగా అధిక జనాభా వలన కలుగు సమస్యలపై స్లోగాలతో ర్యాలీని పరాశపేట సెంటర్ వరకు నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని మాట్లాడుతూ జనాభా స్థిరీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాపులేషన్ పాలసీ గురించి తగిన చర్యలు చేపట్టుట జరుగుతున్నదని వాటిలో ప్రధానమైనవి జనాభా స్థిరీకరణ యొక్క పరిశీలన, నాణ్యమైన వైద్య సేవలను అందించడం ,మౌలిక సదుపాయాలు ,మానవ శక్తి అభివృద్ధి మొదలైనవి. వీటితోపాటు పాటించవలసిన ముఖ్యమైన య్యూహాలు ఎన్ ఎస్ వి వంటి స్టెర్లైజేషన్ వైపు పురుషుల భాగస్వామ్యం పెరుగుదల, తాత్కాలిక పద్ధతులని ప్రోత్సహించడానికి ఆశాలు ప్రయత్నించడం, వివాహ వయసును ప్రోత్సహించటం మరియు వివాహ వయసు గురించి అవగాహన కల్పించుట మొదలైనవి . మొదటి బిడ్డ పుట్టిన తర్వాత రెండవ సంతానానికి మధ్య ఎడమ పాటించేలా జంటలను ప్రోత్సహించడం , అర్హత గల జంటలకు స్పేసింగ్ పద్ధతులను ప్రోత్సహించడం , మెడికల్ ఆఫీసర్ మరియు ఫీల్డ్ సిబ్బందికి దిశా నిర్దేశం కార్యక్రమం , సిబ్బందికి ఐయూసీడీ శిక్షణ, ప్రత్యేక ఐయూసీడీ శిబిరాలు ,ఎం పి ఏ ఇంజక్షన్ గర్భనిరోధకాలు అమలు, ఐఇసి ప్రచారాలు , ప్రజలకు అవగాహన కోసం ర్యాలీలు ముఖ్యంగా చేపట్టటం జరుగుతుందని తెలియజేసినారు . ఈ సంవత్సరం నినాదం అయినా స్వాతంత్ర అమృత మహోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం – కుటుంబ నియంత్రణను సంతోషకరమైన ఎంపికగా మారుద్దాం స్వతంత్ర అమృత మహోత్సవాల సందర్భంగా ఆనందం మరియు శ్రేయస్సు కోసం ఎంపికగా కుటుంబ ప్రణాళికలను స్వీకరించడానికి ప్రతిజ్ఞ చేద్దాం అను నినాదంపై సభ్యులందరికీ ప్రతిజ్ఞ చేయించడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి రామారావు , డాక్టర్ సుదర్శన్ డిపిఎంఓ , దీవెనమ్మ డిపిహెచ్ఎన్ఓ , బి శివసాoబిరెడ్డి , బి రాజేంద్ర కుమార్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
Prajavartha Online Telugu News