-దేశ వ్యాప్తంగా మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి.
-‘రుడా’ కార్యాలయంలో 77 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు :
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) కార్యాలయంలో గౌరవ మేడపాటి షర్మిల రెడ్డి గారు రుడా చైర్ పర్సన్ మరియు బి బాల స్వామి రుడా వైస్ చైర్ పర్సన్ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రుడా కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తదుపరి ఈ 77 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రుడా కార్యాలయంలో జరుపుకుంటున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ 77 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నామని, ఎంతోమంది స్వాతంత్ర యోధులు భారత స్వాతంత్య్రం కోసం పోరాడినారని అలాగే మనం అందరం కూడా దేశాభివృద్ధికి కృషి చేయాలని తెలిపినారు
ఈ కార్యక్రమంలో రుడా సెక్రెటరీ జి శైలజవల్లి గారు, చంద్రశేఖర్ గారు రుడా EE (FAC), దుర్గా ప్రసాద్ AE, ఏన్ శ్రీనివాస్ గారు రుడా ప్లానింగ్ అధికారి, ఏం అనిత APO, RV కోటేశ్వర రావు JPO, K రాజకుమారి TPS మరియు తదితర రుడా ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.