-వర్షాల నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చెయ్యాలి
-క్షేత్ర స్థాయి లో ముందస్తు ఏర్పాట్లు పరిశీలన
-జేసీ తేజ్ భరత్, ఎమ్ సి కే. దినేష్ కుమార్
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 30 వ తేదీ నిడదవోలు పట్టణంలో నిర్వహించే “వైస్సార్ కాపు నేస్తం” రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించినట్లు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ , మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం ఆగస్ట్ 30 న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపధ్యంలో నిడదవోలు లో ముందస్తు ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, శాసన సభ్యులు జి. శ్రీనివాస నాయుడు ఇతర అధికారులు పరిశీలించారు.
ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ సీఎం పర్యటన నిమిత్తం హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు రోడ్ షో నిర్వహిస్తున్న దృష్ట్యా బ్యారికెడ్లు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వర్ష సూచనలు నేపథ్యంలో పర్యటించి అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు.
మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, సభా వేదిక, వివి ఐ పి గ్యాలరీ, ఇతర గ్యాలరీల కు చెంది సూచనలు చేసినట్లు తెలిపారు.
ఈ. ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు, నిడదవోలు పర్యటన లో రాష్ట్ర స్థాయి వైయస్ఆర్ కాపు నేస్తం కార్యక్రమం ద్వారా లబ్దిదారుల ఖాతాకు నేరుగా నగదు జమ చేసే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ లు ఎస్. మల్లిబాబు, ఎస్ ఈ పిఆర్ ఏ బి వి ప్రసాద్, పీడీ డ్వామా పి. జగదాంబ, ఎస్ ఈ ఆర్డబ్ల్యూఎస్ డీ. బాల శంకర రావు, తహశీల్దార్ , ఎంపిడివో, నిడదవోలు మునిసిపల్ కమిషనర్, ఇతర జిల్లా అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News